కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీయార్ భేటీ విషయంలో తెలుగుదేశంపార్టీ పరిస్ధితి దారుణంగా తయారైంది. వీళ్ళ భేటీలో ఏమి మాట్లాడుకుంటారనే విషయాన్ని పక్కనపెట్టేస్తే అసలు జూనియర్ తో అమిత్ భేటీ అవటాన్నే తమ్ముళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే చంద్రబాబునాయుడుకు జూనియర్ కు పడదన్న విషయం తెలిసిందే. ఒకవైపు బీజేపీతో పొత్తుకు చంద్రబాబు తహతహలాడుతుంటే మరోవైపు జూనియర్ తో అమిత్ భేటీ అవటాన్ని తట్టుకోలేకపోతున్నారు.

మూడేళ్ళుగా అమిత్ షాతో అపాయిట్మెంట్ కోసం చంద్రబాబు శతవిధాల ప్రయత్నిస్తున్నా దగ్గరకు కూడా రానీయటంలేదు. అలాంటిది తనంతట తానుగా జూనియర్ ను డిన్నర్ కు రమ్మని అమిత్ ఆహ్వానించటం టీడీపీకి పుండుమీద కారం రాసినట్లుంది. సరే ఈ విషయంలో చంద్రబాబు అండ్ కో పరిస్ధితి కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారైంది. ఇందుకనే తామేమీ మాట్లాడకుండానే ఎల్లోమీడియాకు బాధ్యతలు అప్పగించారు.

వెంటనే రంగంలోకి దిగేసిన ఎల్లోమీడియా వచ్చే ఎన్నికల్లో  జూనియర్ తో ప్రచారం చేయించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విశ్లేషణలు మొదలుపెట్టింది. ఇక్కడే ఎల్లోమీడియా కడుపుమంటంతా బయటపడింది. బీజేపీకి జూనియర్ ప్రచారంచేస్తే టీఆర్ఎస్, వైసీపీకి ఇబ్బందులే అంటు ప్రచారం మొదలుపెట్టింది. జూనియర్ ను రంగంలోకి దింపటం ద్వారా టీఆర్ఎస్, వైసీపీ వ్యతిరేకులను ఆకర్షించాలని ప్లాన్ చేస్తున్నట్లు పిచ్చి లాజిక్కులతో పెద్ద స్టోరీనే అచ్చేసింది. 


నిజంగానే జూనియర్ గనుక బీజేపీకి ప్రచారంచేస్తే ముందు దెబ్బపడేది టీడీపీ పైనే అన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే చంద్రబాబుపై తనకున్న వ్యతిరేకతను కచ్చితంగా జూనియర్ బయటపెడతారు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా జూనియర్ మాట్లాడుతారు. కానీ చంద్రబాబుతో జూనియర్ కు ఉన్నట్లు జగన్తో గట్టుతగాదాలు లేవు. కాబట్టి సామాజికవర్గంపరంగా తీసుకున్నా ఎన్టీయార్ అభిమానులు, టీడీపీని తీసుకున్నా ముందు దెబ్బ చంద్రబాబుకే కానీ జగన్ కు కాదు. అయితే ఎల్లోమీడియా మాత్రం చంద్రబాబును వదిలేసి జగన్ కు పెద్ద దెబ్బని గోల మొదలుపెట్టింది. ఒకసారేమో జూనియర్ అసలు రాజకీయాల్లోకి రారని రాసింది. మోరోచోటేమో వైసీపీకే నష్టమంటు రాయటమే విచిత్రంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: