అధికారంలో ఉండటం, ప్రతిపక్షంలో ఉండటమనే తేడాలు తప్ప చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు పరిస్ధితి దాదాపు ఒకేలాగ ఉందని అర్ధమైపోతోంది. ఆరోపణలపై మంత్రులు స్పందించటంలేదని జగన్ మొత్తుకుంటున్నారు. అధికారపార్టీ నేతల ఆగడాలను ఎదుర్కోవటంలో సీనియర్ నేతలు ఎందుకుస్పందించటంలేదని చంద్రబాబు మండిపోతున్నారు. జగన్, చంద్రబాబు మొత్తుకుంటున్నది చూస్తుంటే ఇద్దరి పరిస్ధితి దాదాపు ఒకేలాగ ఉంటున్నట్లు అర్ధమవటంలేదా ?





ఇంతకీ విషయం ఏమిటంటే క్యాబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులకు జగన్ ఫుల్లుగా క్లాసుపీకారు. కారణం ఏమిటంటే ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాంలో తనతో పాటు తన భార్య వైఎస్ భారతి పాత్రుందని టీడీపీ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళ ఆరోపణలకు ఆధారాలు ఏమున్నాయంటే ఏమీలేవు. గుడ్డకాల్చి మీదేసేయటం టీడీపీ నేతలకు అలవాటు కాబట్టి జగన్+భారతిపై అదే పనిగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను తిప్పికొట్టడంలో వైసీపీ దాదాపు ఫెయిలైందనే చెప్పాలి.






టీడీపీ నేతల ఆరోపణలను ఖండిస్తు ఇద్దరు ముగ్గురు మహిళా నేతలు, మంత్రి ఉషశ్రీ చరణ తప్ప ఇంకెవరు మాట్లాడలేదు. మరింతమంది మంత్రులు, మాజీమంత్రులుండి ఏమిటి ఉపయోగం అన్నది జగన్ పాయింట్. తమపై టీడీపీ నిరాధార ఆరోపణలు చేస్తుంటే మంత్రులంతా ఏమిచేస్తున్నారని జగన్ మండిపోయారు. అందుకనే ఫుల్లుగా క్లాసుపీకారు. మంత్రులు ఏమిచేస్తున్నారంటే హోదాపరంగా వచ్చిన ప్రోటోకాల్ ను ఎంజాయ్ చేస్తున్నారంతే.





ఇదే పద్దతి టీడీపీలో కనబడుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని పిలుపిస్తే చాలామంది సీనియర్ నేతలు అసలు పట్టించుకోవటంలేదని చంద్రబాబు మొత్తుకుంటున్నారు. విజయవాడలో సీనియర్ నేత చెన్నుపాటి గాంధిపై వైసీపీ నేతలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచినా నేతల్లో ఒక్కరు కూడా ఖండించకపోవటంతో నేతలకు చంద్రబాబు ఫుల్లుగా క్లాసుపీకారు. దాడికి గురైన గాంధీని పరామర్శించటానికి ఒక్కనేత కూడా వెళ్ళకపోవటం ఏమిటంటే చంద్రబాబు నేతలను నిలదీశారు. ప్రతి చిన్న విషయానికే తానే స్పందిస్తుంటే మిగిలిన నేతలంతా ఎందుకన్నట్లుగా రెచ్చిపోయారు. ఇప్పుడు చెప్పండి జగన్, చంద్రబాబు పరిస్ధితిలో ఏమైనా తేడా ఉందా ?



మరింత సమాచారం తెలుసుకోండి: