మూడున్నర సంవత్సరాల క్రితం మాజీ ఎంపీ మరియు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి ని తన ఇంట్లోనే అతి దారుణంగా మర్డర్ చేశారు. అయితే కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు ఈ కేసు క్లోజ్ కాకపోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. మాములుగా అయితే ఎంతటి కేసు ను అయినా కొద్దీ రోజుల్లోనే చేధిస్తున్న రోజులలో ఇలా ఒక కీలక రాజకీయ నాయకుడు హత్య కేసును మాత్రం ఇంకా చేధించలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ కేసు సిబిఐ చేతుల్లో ఉంది. అయితే వేరు తాజాగా ఈ కేసు గురించి కీలక విషయాన్ని ఒక పిటిషన్ ద్వారా సుప్రీం కోర్ట్ కు తెలిపింది. ఇప్పటి వరకు ఈ కేసు ఒక కొలిక్కి రాకపోవడానికి కారణం నిందితులు మరియు స్థానిక పోలీసులు పరస్పర సహకారమే అని తేల్చి చెప్పింది.

అందుకే తదుపరి విచారణ సరిగా జరగడం లేదని సిబిఐ సుప్రీం కు ఆ పిటిషన్ లో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ చేసిన గంగిరెడ్డి బెయిల్ పై బయట ఉన్న విషయం తెలిసిందే. అయితే సిబిఐ ప్రకారం గంగిరెడ్డి బయట ఉండడం ఈ కేసుకు ప్రదానం అయిన సాక్ష్యులకు ప్రాణ హాని ఉందని, కనుక గంగిరెడ్డికి బెయిల్ ను వెంటనే రద్దు చేయాలని సుప్రీం కోర్ట్ ను కోరింది. ఈ పిటిషన్ ను పరిశీలించిన సుప్రీం కోర్ట్ జస్టిస్ ఎం ఆర్ షా జస్టిస్ సుందరేశ్ లు ఈ విషయాన్ని అమోదించినట్లు తెలుస్తోంది. అందుకే సిబిఐ పిటిషన్ మీద గంగిరెడ్డికి ఒక నోటీసును ఇవ్వడం జరిగింది. ఈ నోటీసుకు నాలుగు వారాలలో తన సమాధానాలను ఇవ్వాల్సి ఉంది.

వివేకా కూతురు సునీత సైతం తన తండ్రి మర్డర్ కేసు ఇంకా తేలకపోవడంతో చాలా విచారంలో ఉంది. అందుకే ఈ కేసును పక్క రాష్ట్రానికి బదిలీ చెయ్యాలని సుప్రీం కోర్ట్ ను కోరడమైనది. ఇదే సమయంలో ఈ కేసులో స్థానిక పోలీసులతో నింధితులు కలిసి ఉన్నారని సిబిఐ చెప్పడంతో, ఈ కారణంగా అయినా కేసు ఛేదన కోసం సుప్రీం కోర్ట్ వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తుందా అన్నది తెలియాలంటే నవంబర్ 14 వరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: