తమ ప్రతిభకు పదును పెడుతూ కష్టాన్ని ఇష్టంగా పడుతున్నారు. తాజాగా ఓ మహిళా ఏకంగా ఆటోడ్రైవర్ గా మారి.. రికార్డ్ సృష్టించింది. భర్తకు ఆర్ధికంగా అండగా ఉండడం కోసం జీవనోపాధిగా డ్రైవర్ గా మారింది.. జమ్మూలో మొదటి మహిళా ఇ-రిక్షా డ్రైవర్ గా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే..జమ్మూ డివిజన్‌లోని నగ్రోటా ప్రాంతానికి చెందిన సీమా దేవి తమ ఇంటి ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంది. తన భర్తకు ఆర్ధికంగా అండగా నిలబడాలని కోరుకుంది.. అందుకు ఏవిధంగా తాను ముందుకు వెళ్ళాలా అని ఆలోచించింది. చివరకు ఇ-రిక్షా సీమా దేవి దృష్టికి వచ్చింది. దీంతో జీవనోపాధి కోసం ఇ-రిక్షా డ్రైవర్ గా మారింది. జమ్మూ కశ్మీర్ లో మొదటి మొదటి మహిళా ఇ-రిక్షా డ్రైవర్ గా చరిత్ర సృష్టించింది సీమా దేవి.
ఇదే విషయంపై సీమా స్పందిస్తూ.. తమకు ముగ్గురు పిల్లలని.. దీంతో తన భర్తకు ఆర్థికంగా అండగా నిలబడాలనే కోరికతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అంతేకాదు తాను ఈ రిక్షా డ్రైవర్ గా కొన్ని అడ్డంకులను ఎదుర్కొన్నట్లు పేర్కొంది. అయితే కొంతమంది ప్రయాణీకులు తనను మొదట్లో వింతగా చూసేవారని.. మరొకొందరు భయపడేవారని చెప్పారు సీమ.. అయితే ప్రయాణీకుల భయాందోళనలను అధిగమించి.. వారి నమ్మకం దక్కేవరకూ ప్రయాణం ఉత్సాహంగా సాగలేదని పేర్కొంది. అయితే ఇప్పుడు తనకు ఆదాయం బాగుందని..తాను తీసుకున్న నిర్ణయంతో తన ఫ్యామిలీ ఎంతో సంతోషముగా ఉందని తెలిపింది సీమా. ఇప్పడు తన నిర్ణయానికి తన కుటుంబం మద్దతునిస్తుందని ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది..కుటుంబానికి అండగా నిలబడాలి అనుకోనేవారికి ఆమె ఆదర్శంగా ఉందని స్థానికులు చెబుతున్నారు..