జగన్మోహన్ రెడ్డి మీద పెరిగిపోతున్న ఉక్రోషమో లేకపోతే జనాల సింపతి కోసమో తెలీటంలేదు కానీ తానేం చేస్తున్నాడో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కే తెలీటంలేదు. తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామంలో విస్తరణ పనులు పెద్ద వివాదమైపోయింది. జనాలు ఆక్రమించి కట్టుకున్న కాంపౌడ్ వాల్స్ ను కూల్చేసి రోడ్లను విస్తరిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే కక్షసాధింపులో భాగంగా ప్రభుత్వం ఇప్పటం గ్రామస్తుల ఇళ్ళను కూల్చేస్తోందంటు పవన్, చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా గోలగోల చేసేస్తున్నారు.





ప్రభుత్వం కక్షసాధింపు కారణంగా ఇళ్ళను కోల్పోయిన బాధితులను పరామర్శించేందుకు పవన్ మంగళగిరిలోని పార్టీఆఫీసునుండి ఇప్పటం గ్రామానికి వెళ్ళారు. అయితే బయలుదేరటం ఎలాగ బయలుదేరారంటే కారు టాప్ పైన కూర్చుని ప్రయాణంచేశారు. పవన్ ఎక్కడ జారి కిందపడిపోతారో అన్న టెన్షన్ తో ఆయన సెక్యూరిటి+కొందరు వ్యక్తిగత సిబ్బంది కారుకు రెండువైపులా అడ్డంగా నిల్చున్నారు. తాను సినిమాల్లో మాత్రమే హీరో అని తాను చేసే చేష్టలన్నీ సినిమాషూటింగల్లో మాత్రమే పనికివస్తాయన్న విషయాన్ని పవన్ మరచిపోయినట్లున్నారు.





స్పీడుగా వెళుతున్న కారుకు డ్రైవర్ సడెన్ గా బ్రేకులు వేస్తే పరిస్ధితి ఏమిటి ? కారు టాప్ మీదనుండి బాయ్ నెట్ మీదకు జారి తర్వాత సరిగ్గా కారుముందు చక్రాల మధ్యలో పడిపోతారు. లేదా ఎవరైనా ఆకతాయి పవన్ పైకి రాయి విసిరే అవకాశంకూడా ఉంది. అప్పుడు దాన్నికూడా జగన్ మీదే నెపం వేంసేసి జగన్దే తప్పంటు నాలుగురోజులు గోలచేయటమే ప్లాన్ అయ్యుండచ్చు.   కాకపోతే దేవుడి దయవల్ల కారుకు సడెన్ బ్రేకులు వేయాల్సిన అవసరం రాలేదు కాబట్టి సరిపోయింది.





మొత్తానికి నాటకీయ పరిణామాల్లో ఇప్పటం చేరుకున్న పవన్ తనదైన స్టైల్లో జగన్ ప్రభుత్వానికి వార్నింగులిచ్చి, జగన్ పై యధావిధిగా బురదచల్లేశారు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది జగన్ కాదు సజ్జల రామకృష్ణారెడ్డి అంటు వార్నింగులన్నీ జగన్ కే ఇవ్వటమే విచిత్రం. రాష్ట్రాన్ని పాలిస్తున్నది సజ్జలని ఒకవైపు చెబుతునే మళ్ళీ జగన్ కి వార్నింగులు ఇవ్వటంలో పవన్ ఉద్దేశ్యం ఏమిటి ? ఇక్కడే తెలిసిపోతోంది జగన్ అంటే పవన్లో అక్కసు ఎంతగా పెరిగిపోతోందో.

మరింత సమాచారం తెలుసుకోండి: