సొంతిల్లు కొనాలని అనుకోనేవాల్లు ఈరోజుల్లో ఎక్కువ మంది ఉన్నాయి.దాని కోసం ప్రతి ఒక్కరూ లోన్ తీసుకొవాలను కుంటున్నారు. అయితే ఏ బ్యాంకులు వడ్డీని తక్కువ ఇస్తున్నాయో తెలియక ఏదొక బ్యాంకులో డబ్బులను తీసుకొని అధిక వడ్డీ తో ఇబ్బంది పడుతున్నారు... మార్కెట్లో ప్రస్తుతం చాలా బ్యాంకులు హోమ్ లోన్స్ అందిస్తూ వస్తున్నాయి. అలాగే బ్యాంకులు కూడా ఇటీవల రుణ రేట్లు పెంచుకుంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఏ బ్యాంక్లో ఎంత వడ్డీ రేటు ఉంది? ఏ బ్యాంక్లో తక్కువ వడ్డీకే లోన్ పొందొచ్చు? వంటి అంశాలను ముందుగానే తెలుసుకోవాలి.



అందుకు అనుగుణంగా లోన్ ప్లాన్ చేయాలి. ఇప్పుడు మనం తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ అందిస్తున్న ఐదు బ్యాంకులు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం..కరూర్ వైశ్యా బ్యాంక్ చౌక వడ్డీకే హోమ్ లోన్స్ అందిస్తోంది. ఈ బ్యాంక్లో రెపో లింక్డ్ లెండింగ్ రేటు 9 శాతంగా ఉంది. కనీస వడ్డీ రేటు 8.05 శాతంగా ఉంది. గరిష్ట వడ్డీ రేటు 10.35 శాతం. అంటే కస్టమర్లు ఈ వడ్డీ రేట్లకు మధ్యలో హోమ్ లోన్స్ పొందొచ్చు...



హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా చౌక వడ్డీకే రుణాలు అందిస్తోంది. ఈ బ్యాంక్లో రెపో లింక్డ్ లెండింగ్ రేటు 8.1 శాతంగా ఉంది. కనీస వడ్డీ రేటు 8.05 శాతం. గరిష్ట వడ్డీ రేటు 10.25 శాతంగా ఉంది. ఇక కర్నాటక బ్యాంక్లో రెపో లింక్డ్ లెండింగ్ రేటు 7.95 శాతంగా కొనసాగుతోంది. కనీస వడ్డీ రేటు 8.24 శాతంగా ఉంది. గరిష్ట వడ్డీ రేటు 9.59 శాతంగా ఉందని చెప్పుకోవచ్చు.ఇంకా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెపో లింక్డ్ లెండింగ్ రేటు 8.7 శాతంగా ఉంది. కనీస వడ్డీ రేటు 8.25 శాతం. ఇక గరిష్ట వడ్డీ రేటు 10.1 శాతంగా కొనసాగుతోంది. బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్రలో రెపో లింక్డ్ లెండింగ్ రేటు 8.7 శాతంగా ఉంది. కనిష్ట వడ్డీ రేటు 8.3 శాతంగా, గరిష్ట వడ్డీ రేటు 9.7 శాతంగా ఉంది..ఈ బ్యాంకుల ద్వారా మీ హోమ్ లోన్ రేటును తక్కువ చేసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: