అతి పెద్ద ప్రైవేట్ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌ బ్యాంక్‌ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది..క్రెడిట్ కార్డుకు సంబందించి కీలక మార్పులు చేసింది..ఇవి ప్రస్తుతం షాక్ ఇస్తున్నాయని తెలుస్తుంది. క్రెడిట్‌ కార్డు రివార్డు పాయింట్లు, ఫీజు విధానంలో జనవరి 1 2023 నుంచి కొత్త నియమాలను తీసుకొస్తోంది. ఈ మేరకు వినియోగదారులకు సందేశాలు పంపుతోంది.

ముఖ్యంగా థర్డ్‌ పార్టీ యాప్స్‌ ద్వారా చేసే రెంట్‌ పేమెంట్స్‌ పై hdfc దృష్టి పెట్టింది. ఇప్పటికే ICICI, sbi ఈ తరహా పేమెంట్లపై ఛార్జీలు వసూలు చేస్తామని ప్రకటించాయి. తాజాగా hdfc సైతం అదే బాట పెట్టింది. ఒక క్యాలెండర్‌ నెలలో జరిపే రెండో అద్దె చెల్లింపులపై 1 శాతం ఫీజు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే, రివార్డు పాయింట్ల ప్రోగ్రామ్‌లో కొన్ని మార్పులు చేసింది. hdfc బ్యాంక్‌ స్మార్ట్‌బై పోర్టల్‌లో రివార్డు పాయింట్ల రీడీమ్‌పై పరిమితి విధించింది..ఇప్పుడు ఎటువంటి వాటి పై పరిమితి విధించింది అనేది తెలుసుకుందాం..

*. ఇన్ఫినియా కార్డుదారులు ఇకపై ఒక క్యాలెండర్‌ నెలలో విమానాలు, హోటళ్ల బుకింగ్‌పై గరిష్ఠంగా 1.50 లక్షల రివార్డు పాయింట్లు మాత్రమే రీడీమ్‌ చేసుకోగలరు. అలాగే డైనర్స్‌ బ్లాక్‌ కార్డు దారులు 75 వేలు, మిగిలిన కార్డు హోల్డర్లు 50 వేల పాయింట్లు మాత్రమే రీడీమ్‌ చేసుకోగలరని హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది.

*. ఇన్ఫినియా కార్డు హోల్డర్లు ఒక క్యాలెండర్‌లో నెలలో తనిష్క్‌ వోచర్లపై గరిష్ఠంగా 50వేల పాయింట్లు మాత్రమే రీడీమ్‌ చేసుకునే వీలుంది.

*. 2023 ఫిబ్రవరి 1 నుంచి మిలినియా, ఈజీ ఈఎంఐ మిలీనియా, భారత్‌, ఫార్మా ఈజీ, పేటీఎం కార్డు హోల్డర్లు స్టేట్‌మెంట్‌ బ్యాలెన్స్‌పై గరిష్ఠంగా 3వేల రివార్డు పాయింట్లు మాత్రమే పొందుతారు. మిగిలిన కార్డు హోల్డర్లు గరిష్ఠంగా 50 వేలు రివార్డులు పొందుతారని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది.

*. ఉత్పత్తుల మొత్తం విలువలో ఇకపై 70 శాతం వరకు మాత్రమే రివార్డు పాయింట్లు వినియోగానికి వీలుంటుంది. మిగిలిన మొత్తాన్ని ఆ క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నియమం సైతం ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది.

*.అలాగే రెంట్‌ పేమెంట్లు, ప్రభుత్వానికి సంబంధించిన లావాదేవీలు, విద్యా సంబంధిత లావాదేవీలపై కొన్ని ఎంపిక చేసిన కార్డులు మినహా రివార్డులు వర్తించబోవని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ స్పష్టంచేసింది. గ్రాసరీ సంబంధిత లావాదేవీలపైనా రివార్డులపై పరిమితి విధించింది..వీటి పై మరింత సమాచారాన్ని పొందాలనుకుంటే బ్యాంకు అధికార పోర్టల్ చెక్ చేసుకోవచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి: