జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఇఫ్పటికైనా విషయం అర్ధమయ్యిందో లేదో తెలీటంలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డికి నరేంద్రమోడి ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో తాజాగా మరోసారి అందరికీ తెలిసింది. తాజాగా రాష్ట్రపతి భవన్లో జరిగిన జీ20 సన్నాహక సమావేశంలో  ఆత్మీయ సంభాషణతో జగన్ కు మోడీ ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో ఇప్పటికైనా పవన్  బుర్రకు ఎక్కిందా అన్నది సందేహమే.





ఎలాగైనా జగన్ను ఏదో చేయాలన్న కసే తప్ప పవన్లో మరో ఆలోచన ఏమీ కనబడటంలేదు. ఏదో చేయాలనే తప్ప ఏమిచేయాలనే క్లారిటి కనబడటంలేదు. నరేంద్రమోడీని అడ్డంపెట్టుకుని జగన్ను సాదిద్దామని అనుకున్నట్లున్నారు. కానీ అది సాధ్యంకాకపోవటంతో పవన్లో బీజేపీ అంటే బాగా మండిపోతోంది. కానీ ఏమీచేయలేని నిస్సహాయయత వెంటాడుతోంది. జగన్ను డైరెక్టుగా ఏమీచేయలేనన్న విషయం ఎప్పుడో అర్ధమైపోయింది.  కేంద్రంలోని బీజేపీని అడ్డుపెట్టుకోవాలని ప్లాన్ చేశారు. అందుకనే రోడ్డుమ్యాపని మరోటని ఏదేదో మాట్లాడుతున్నారు.





అయితే పవన్ అడిగిన రోడ్డుమ్యాపేమీ లేదని మోడీ స్పష్టంగా చెప్పేశారు. రాజకీయాల్లో ప్రత్యేకించి రోడ్డుమ్యాపంటు ఏమీఉండదని కూడా తేల్చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు చేసుకుంటు పోవటమే రోడ్డుమ్యాపని చెప్పారు. అయితే మోడీ చెప్పిన రోడ్డుమ్యాప్ అమలు చేయటంలో పవన్ కు అంత ఓపికలేదన్న విషయం అందరికీ తెలిసిందే. సినిమా షూటింగుల గ్యాప్ లో పార్టీ సమావేశాలు, జిల్లాల పర్యటనలు చేసే పవన్ కు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసేంత ఓపిక, తీరికా ఎక్కడుంటాయి ?





అందుకనే ఏదో షార్ట్ కట్ లో రోడ్డుమ్యాపంటు నానా రచ్చచేసింది. చివరకు అలాంటిదేమీ లేదని తేలిపోవటంతో పవన్ ప్లాన్లన్నీ నీరుకారిపోయాయి. తాజాగా జరిగిన మోడీ-జగన్ మాటామంతీతో అయినా వాళ్ళ సాన్నిహిత్యం పవన్ కు అర్ధమయ్యుంటుందా ? ఎందుకంటే జగన్ తో మోడీకి పార్లమెంటులో చాలా అవసరముంది. కాబట్టి పవన్ చెప్పినట్లు మోడీ సర్కార్ నడుచుకోదన్న విషయం ఎప్పటికైనా బోధపడుతుందో లేదో అర్ధం కావటంలేదు. ఈ విషయం పవన్ కు అర్ధమయ్యేనాటికి ఎన్నికలు కూడా అయిపోతాయేమో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: