పొదుపు పథకాల్లో పీఎఫ్ ఖాతా ఒకటి.. మీరు మీ పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు ను విత్‌డ్రా చేయాలనుకుంటే, ముందుగా మీరు ఈ ముఖ్యమైన డాక్యుమెంట్‌ల ను అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి, లేకుంటే డబ్బును విత్‌డ్రా చేయడం లో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. ఈ ఖాతా తో జమ అయిన డబ్బుల ను డ్రా చేసుకొవచ్చు.. ఇక ఉద్యోగం నుంచి తొలగిన తర్వాత పూర్తి డబ్బుల ను డ్రా చేసుకొవచ్చు..



వివాహం, మెడికల్ ఎమర్జెన్సీ, హోమ్ లోన్ చెల్లింపు లాంటి అంశాలు ఏవైనా కూడా ఈ పీఎఫ్ ఫండ్‌ లో డిపాజిట్ చేసిన మొత్తం లో కొంత భాగాన్ని కొన్ని షరతుల ప్రకారం విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు పదవీ విరమణ కు ముందు PF డబ్బును ఉపసంహరించు కోవాలనుకుంటే, దానికోసం కొన్ని పత్రాల ను అప్‌డేట్ చేయడం తప్పనిసరి. ఈ డాక్యుమెంట్స్ సాయం తో పీఎఫ్ డబ్బును ఈజీగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగుల కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన పొదుపు కార్యక్రమాల్లో ఒకటి ఉద్యోగుల భవిష్య నిధి ఇది..


ఈ అకౌంట్ ను క్లోజ్ చెయ్యడాని కి కావలసిన పత్రాలు..

*. రెండు రెవెన్యూ స్టాంపులు


*. క్లెయిమ్ ఫారం
*. బ్యాంక్ ఖాతా వివరాలు (బ్యాంక్ ఖాతా PF ఖాతాదారుడి పేరు మీద మాత్రమే ఉండాలి)
*. ఐడెంటిటీ ప్రూఫ్
*. అడ్రెస్ ప్రూఫ్
*.IFSC కోడ్
*. బ్యాంక్ ఖాతా నెంబర్‌ తో క్యాన్సిల్ద్ చెక్కు
*. పుట్టిన తేదీ, తండ్రి పేరు వంటి వ్యక్తిగత వివరాలు ఐడెంటిటీ ప్రూఫ్‌తో స్పష్టంగా సరిపోవాలి.


అయితే, ఒక ఉద్యోగి 5 సంవత్సరాల నిరంతర ఉద్యోగానికి ముందు తన PF మొత్తాన్ని విత్‌ డ్రా చేసినట్లయితే.. అతడు ప్రతి సంవత్సరం PF ఖాతా లో జమ చేసిన మొత్తానికి ఆదాయపు పన్ను రిటర్న్ ఫారమ్ 2, 3 ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: