
ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరికను జారీ చేసింది. ఎన్ని రకాలుగా కస్టమర్లకు సెక్యురిటీని అందిస్తున్నా కూడా సైబర్ నేరుగాల్ల వలలకు చిక్కుకొని మోస పోతున్నారు.. ఇలాంటి వాటి గురించి ప్రభుత్వం ఎన్ని రకాలుగా హెచ్చరిస్తున్నా కూడా ఏదొక విధంగా బ్యాంక్ కస్టమర్ల పై అటాక్ చెయ్యటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు చేపడుతోన్నా సైబర్ నేరాల బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది..
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గాల తో ప్రజలను మోసం చేస్తున్నారు. రకరకాల మోస పూరిత లింక్‌ల తో అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ మోసపూరిత మెసేజ్‌తో ఎస్‌బీఐ ఖాతాదారుల కు గాలం వేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. దీని పై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. కొంతమంది ఎస్‌బీఐ ఖాతాదారులకు అన్‌నోన్ నెంబర్ నుంచి ఒక మెసేజ్ తో పాటు లింక్ వస్తోంది. దీంట్లో.. 'ఎస్‌బీఐ ఖాతాదారు లు మీ యోనో అకౌంట్ ఈరోజు బ్లాక్ అయ్యింది.
మీ పాన్ కార్డ్‌ను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా అకౌంట్‌ను తిరిగి పొందొచ్చు. దీని కోసం ఈ లింక్‌ను వెంటనే క్లిక్ చేయండి' అనే మెసేజ్‌ను ఫోన్ కు పంపిస్తున్నారు. అయితే ఈ మెసేజ్ పూర్తిగా అబద్ధమని పీఐబీ తెలిపింది. ఎస్‌బీఐ ఇలాంటి ప్రకటన చేయలేదని తేల్చి చెప్పింది. పీఎఐబీ ఫ్యాక్ట్ చెక్‌లో ఈ మెసేజ్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ ఇలాంటి ఎస్‌ఎమ్‌ఎస్‌లకు ఎట్టి పరిస్థితుల్లో స్పందించకూడదని, పొరపాటున కూడా వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు ఇవ్వకండి అని రాసుకొచ్చింది.. ఎస్‌బీ మెసేజ్‌ల రూపంలో ఖాతాదారు ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించదని తేల్చి చెప్పింది. వచ్చిన సమాచారాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని సూచించింది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.