ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్ గా ఉంటుంది. ప్రతి ఎన్నికల సమయంలోనూ నాయకులు పార్టీలు మారుతూ ఉత్కంఠను మరింత పెంచేస్తూ ఉంటారు. గతంలో ఇలాంటివి చాలానే జరిగాయి. కాగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ లో పాలన ఒక్కటే సరిగా ఉంటే సరిపోదు, సొంత పార్టీ నాయకులను మరియు ఎమ్మెల్యే ఎంపీ లను కూడా బుజ్జగించి కొంచెం పట్టించుకోవాలని ఎప్పుడూ రాజకీయ విశ్లేషకులు చెబుతూనే ఉంటారు. ఒకవేళ అలా జరగకపోతే పార్టీకి అలాంటి అసమ్మతి నేతలు ఎదురుతిరిగే ప్రమాదం లేకపోలేదు. అయితే ఇప్పుడు అధికార వైసిపికి కూడా ఇది తప్పేలా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా ఒక 20 మంది ఎమ్మెల్యే మరియు ఎంపిలు వైసీపీ అధిష్టానం పట్ల గుర్రుగా ఉన్నారు.

ఇక నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గురించి ఇప్పుడు ఒక విషయం  చర్చల్లో ఉంది. ఒకప్పుడు ఆనం ఫ్యామిలీ అంటే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అందెవేసిన చెయ్యి. ఆ ఫ్యామిలీ ఏది చెబితే అదే జరిగేది. ఇక కాంగ్రెస్ లో చాలా కాలం పాటు కొనసాగిన నేతగా ఆనం రామనారాయణ రెడ్డికి పేరుంది. అప్పట్లో మంత్రిగా ఉన్న ఆనం జిల్లాలో ఒంటిచేత్తో రాజకీయాలను శాసించేవాడు. కానీ ఒక్కసారిగా వైయస్సార్ మరణం, ప్రత్యేక తెలంగాణ ఇవ్వడం వంటి కారణాలతో కాంగ్రెస్ ఓటమి పాలయింది. అలా 2014 లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత 2019 లో వైసీపీ పంచన చేరి వెంకటగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యాడు. కానీ సీనియర్ నేత కావున మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డాడు.

జగన్ మాత్రం సీనియర్ లని చూడకుండా పనిచేసే వారికి మంత్రి పదవులను కట్టబెట్టి ఆనం ను పక్కన పెట్టాడు. అప్పటి నుండి ఆనం అవకాశం వచ్చినప్పడల్లా ప్రభుత్వ పనితీరుని విమర్శిస్తూ సంతోష పడుతున్నారు. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం 2024 ఎన్నికలో కూడా ఆనం కు వెంకటగిరి సీటు దక్కేలా లేదు, ఆ సీటును ఎన్ రామ్ కుమార్ రెడ్డికి కేటాయించే దిశగా ఆలోచన చేస్తున్నారట. ఇక చేసేది ఏమీ లేక ప్రత్యామ్నాయం గా ఉన్న టీడీపీలోకి ఆనం జంప్ చేయడానికి రెఢీ అయిపోయాడట. చంద్రబాబు కూడా ఆనం కు రెడీ గా ఆత్మకూరు ఎమ్మెల్యే సీటును రిజర్వ్ చేశారట. మరి త్వరలోనే అనం నుండి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: