నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత రెండు వారాలుగా రాష్ట్రంలో పెద్ద హడావిడి సృష్టించిన సంగతి తెలిసిందే. గత రెండు ఎన్నికలుగా వైసీపీ నుండి టికెట్ ను పొంది జగన్ మరియు వైఎస్సార్ ల చరిష్మాతో గెలిచి ఎమ్మెల్యే గా అయ్యాడు. కానీ శ్రీధర్ రెడ్డి గత వారంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి అందరినీ షాక్ కు గురి చేశారు. అంతే కాకుండా అదే ప్రెస్ మీట్ లో వచ్చే ఎన్నికలలో నెల్లూర్ రూరల్ నుండి ప్రతిపక్ష పార్టీ టిడిపి తరపున పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నాను అంటూ ఎంతో బాహాటంగా చెప్పారు. దీనిని బట్టి అందరూ కూడా ఎప్పటి నుండో శ్రీధర్ రెడ్డి టీడీపీతో టచ్ లో ఉంటూ ఇప్పుడు ఫోన్ టాపింగ్ ను సాకుగా చూపుతూ తనకు నచ్చిన పార్టీలోకి వెళుతున్నాడు అంటూ అనుకున్నారు.

ఈ విషయం గురించి నెల్లూర్ జిల్లా అంతటా గందరగోళంగా మారింది, రోజూ ప్రెస్ మీట్ పెట్టడం వైసీపీని మరియు వారి నాయకులను విమర్శించడం చేస్తున్నారని అధికార పార్టీ నాయకులు ప్రతి విమర్శలు చేస్తున్న విషయం విదితమే. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తొందరపడ్డారా అంటూ రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ముందుగా కోటంరెడ్డి కోరిక ప్రకారం టీడీపీలోకి వెళ్లాలని అనుకోవడం.. మళ్ళీ ఇప్పుడు రివర్స్ అయినట్లు తెలుస్తోంది. టీడీపీ అధిష్టానం కోటంరెడ్డిని పార్టీ లోకి తీసుకోవడానికి సుముఖంగా లేదని సమాచారం. ఏకంగా నెల్లూర్ జిల్లా టీడీపీ నాయకులు అంతా మూకుమ్మడిగా కోటంరెడ్డి ని పార్టీలోకి తీసుకోవద్దని  చెప్పారట.

అతను పార్టీలో చేరితే కార్యకర్తలు అస్సలు పనిచేయరని నెల్లూర్ జిల్లా టీడీపీ ముఖ్య నాయకులు అంతా చంద్రబాబు దగ్గర వివరించారు అని తెలుస్తోంది. అయితే చంద్రబాబు ఇంతకు ముందు కోటంరెడ్డిని పార్టీలోకి తీసుకుందాం అనే ఆలోచనలో ఉండగా, ఇప్పుడు సొంత పార్టీ నాయకుల మాటలతో ఏకీభవించి నిర్ణయాన్ని మార్చుకున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఇది నిజంగా కోటంరెడ్డికి బిగ్ షాక్ అని చెప్పాలి. ఈ విషయాన్ని రాజకీయ ప్రముఖులు అధికార పార్టీలో హాయిగా ఉండకుండా ఎటూ పనికిరాని విమర్శలు చేసి రాజకీయ జీవితానికే ముగింపు పలికే తప్పిదం చేశారని కోటంరెడ్డి పై జాలి పడుతున్నారు. మరి కోటంరెడ్డి తర్వాత స్టెప్ ఏమై ఉంటుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: