తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎంఎల్ఏ జేసీ ప్రభాకరరెడ్డికి ఏమో అయ్యింది. పోయిన ఎన్నికల్లో తన కొడుకు అశ్మిత్ రెడ్డి ఓడిపోయిన దెబ్బకు జేసీకి ఏమో అయినట్లుంది.  ఒకవైపు వారసుడు ఓడిపోవటం,  తర్వాత జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఆర్ధికంగా సమస్యలు పెరిగిపోవటం, మరోవైపు వచ్చేఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం లేకపోవటం. వెరసి జేసీకి మానసికంగా ఏవో సమస్యలు మొదలైనట్లున్నాయి.





మధ్యలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా అయినా ఉపయోగం లేకపోయింది. తాజాగా పట్టణంలో చొక్కా విప్పేసి ఆదివారం రోడ్లపైన తిరిగారు. తన చాతీపైన లవ్ సింబల్లో తాడిపత్రి అని రాసున్న స్టిక్కర్ ను అంటించుకుని రోడ్లపైన వెళుతున్న జనాలకు చూపించారు. ఎందుకంటే తన గుండె తాడిపత్రి..తాడిపత్రి అని పరితపిస్తుందని చెప్పటమట. జేసీ వైఖరి ఎంతవిచిత్రంగా ఉందంటే ఆదివారం చొక్కాను విప్పేసిన జేసీ ముందు ముందు ఇంకేమి విప్పేస్తారో తెలీకుండా ఉంది.





తాడిపత్రి ఎంఎల్ఏగా గెలిచిన కేతిరెడ్డి పెద్దారెడ్డికి జేసీ బ్రదర్స్ కు ఏమాత్రం పడదు. పెద్దారెడ్డిని ఒకపుడు జేసీలు బాగా వెంటాడారు. దానికి ఎంఎల్ఏ ఇపుడు బదులు తీర్చుకుంటున్నారు. పెద్దారెడ్డి వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను జేసీ బ్రదర్స్ తట్టుకోలేకపోతున్నట్లున్నారు. జేసీ దివాకరరెడ్డి అయితే రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా కనబడటంలేదు. ఏదో అప్పుడప్పుడు సెన్షేషన్ కోసం ఏదోక ప్రకటన చేస్తుంటారంతే.





అయితే ప్రభాకర్ మున్సిపల్ ఛైర్మన్ కదా అందుకనే పెద్దారెడ్డితో గొడవలు పడుతుంటారు. ఇపుడు కూడా ఇద్దరిలో ఎవరు నీతిమంతులు, ఎవరు దొంగలు అన్న సబ్జెక్టు మీదే ఇద్దరి మధ్య గొడవైంది. జేసీ డీజల్ దొంగ అంటు కొందరు జేసీ ఫొటోతో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. దానికి కౌంటరుగా అక్కడే ఉన్న మరో ఫ్లెక్సీ దగ్గరకు వెళ్ళి పెద్దారెడ్డి ఫొటోను చూపించి ఇద్దరం దొంగలమే అని గట్టిగా అరిచారు. అంతేకాకుండా పెద్దారెడ్డి ఫొటోకు ముద్దులు కూడా పెట్టారు. చివరకు తన చొక్కాను విప్పేసుకుని చాతిపై అంటించుకున్న లవ్ సింబల్ ను చూపిస్తు రోడ్లపైన తిరిగారు. మొన్నటివరకు రోడ్లపైనే జేసీ స్నానంచేసిన విషయం తెలిసిందే. అలాగే అంతకుముందు కూడా నడిరోడ్డుపైన కూర్చునేశారు. మొత్తానికి జేసీకి ఏమో అయ్యిందనే అనుమానాలైతే పెరిగిపోతున్నాయి.






మరింత సమాచారం తెలుసుకోండి: