అధికారంలోకి మళ్ళీ తామే వస్తామనే నమ్మకం ఉండటంలో తప్పులేదు. రావాలని ప్రయత్నించటం కూడా తప్పుకాదు. కానీ వచ్చేఎన్నికల్లో రీసౌండ్ తో తామే అధికారంలోకి రాబోతున్నామని చెప్పటంలోనే ఓవర్ కాన్ఫిడెన్స్ కనబడుతోంది. నిజంగానే వైసీపీ ప్రభుత్వానికి అంత సీనుందా అన్నదే అనుమానంగా ఉంది. వచ్చేఎన్నికల్లో రీసౌండ్ తో అధికారంలోకి రాబోతున్నామని చెప్పటమంటే అర్ధమేంటి ? పోయిన ఎన్నికల్లో వచ్చిన 151 సీట్లు సాధిస్తామని, లేదా అంతకుమించి సాధిస్తామని చెప్పటమే కదా ?





నిజంగానే సజ్జల చెప్పినట్లుగా వైసీపీకి అంత సీనుందా ? అన్నదే అనుమానంగా ఉంది. ఎందుకంటే అధికారపార్టీ మీద సహజంగానే జనాల్లో ఎంతో కొంత వ్యతిరేకతుంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి పాలనపైన కూడా వ్యతిరేకత ఉంది.  అయితే ఆ వ్యతిరేకత ఏస్ధాయిలో ఉందనేది ఇపుడు ఎక్కడా బయటపడటంలేదు. అది రాబోయే ఎన్నికల్లో మాత్రమే బయటపడుతుంది. జగన్ పాలనలో సంక్షేమపథకాలు అందుకుంటున్న జనాలంతా హ్యాపీగానే ఉన్నారా ? సంక్షేమపథకాలను అందించేస్తే వాళ్ళంతా హ్యాపీగా ఉన్నట్లేనా ?





సంక్షేమపథకాలు అందుకునే వాళ్ళంతా తిరిగి వైసీపీకే ఓట్లేస్తారని గ్యారెంటీ ఉందా ? ఈ ప్రశ్నలకు ముందు సజ్జల సమాధానం చెప్పాలి. అలాగే పథకాలు అందని జనాల సంగతేమిటి ? ముఖ్యంగా మధ్య తరగతి జనాలను ఆదుకునేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలేమీ లేవు. అంటే తనకు మధ్యతరగతి జనాల ఓట్లు అవసరంలేదని జగన్ అనుకుంటున్నారా ? ఉన్నతాదాయవర్గాలు, మధ్యతరగతి జనాలు ఎలాగూ ఓట్లేయరు కాబట్టి వాళ్ళగురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని జగన్ డిసైడ్ అయినట్లే ఉన్నారు.





అందుకనే ఎక్కడ మాట్లాడినా నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటి, నా ఎస్టీ అని మాత్రమే చెబుతుంటారు. ఎక్కడా మధ్య తరగతి ప్రజల కోసం తాను పలానా పథకం అమలుచేస్తున్నట్లు చెప్పలేదు. ఇదే సమయంలో పార్టీలోని అంతర్గత అసమ్మతి మాటేమిటి ? మంత్రివర్గంలోని చాలామంది మొదలుకుని కిందస్ధాయి వరకు ఎంతమంది హ్యాపీగా ఉన్నారో జగన్ ఎప్పుడైనా ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నారా  ? గ్రౌండ్ లెవల్లో రిపోర్టు చూస్తుంటే సజ్జల ప్రకటనపై చాలా అనుమానాలు పెరిగిపోతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: