తెలంగాణాలో బీజేపీ నేతల వ్యవహారం చాలా విచిత్రంగా తయారవుతోంది. అధ్యక్షుడు బండి సంజయ్ అయితే ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి వచ్చేది బీజేపీనే అంటు పదేపదే చెబుతున్నారు. ఇదే సమయంలో 119 నియోజకవర్గాల్లో పోటీచేయటానికి గట్టి అభ్యర్ధులున్నారా అని ఎవరైనా అడిగితే మళ్ళీ సమాధానం ఉండటంలేదు. తాజాగా చేరికల కమిటి అధ్యక్షుడు ఈటల రాజేందర్ చిసిన వ్యాఖ్యలు పార్టీ పరిస్ధితికి అద్దం పడుతున్నాయి.





ఇంతకీ ఈటల ఏమన్నారంటే పార్టీ బలోపేతానికి ఇతర పార్టీల నుండి సీనియర్ నేతల బీజేపీలో చేరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కార్యకర్తలే కాదు నేతలు కూడా ఇతర పార్టీల నుండే కావాలట. వచ్చేఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీ శక్తిని పెంచుకోవాల్సిన అవసరం చాలావుందట. ఢిల్లీ నాయకత్వంతో పాటు రాష్ట్రంలోని నేతలంతా ఇదే అనుకుంటున్నారట. అంటే ఈటల వ్యాఖ్యలను బట్టి బీజేపీ అధికారంలోకి రావాలంటే  ప్రస్తుతం పార్టీకి ఉన్న శక్తి సరిపోదని అంగీకరించినట్లే కదా.





ఇపుడున్న నేతలతో అధికారంలోకి రాలేమని అర్ధమయ్యే ఇతరపార్టీల్లో నుండి నేతలను చేర్చుకోవాలని అనుకుంటున్నట్లు స్పష్టంగానే ఈటల చెప్పారు. అయితే ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరటానికి నేతలు ఎవరు పెద్దగా ఆసక్తిచూపటంలేదు. మునుగోడు ఉపఎన్నిక తర్వాత పార్టీలోకి చెప్పుకోదగ్గ నేతలు ఎవరు చేరలేదు. బీఆర్ఎస్ నేతలు వచ్చి బీజేపీలో చేరాలని కమలనాదులు కోరుకున్నారు. ఎందుకంటే బీజేపీ టార్గెట్ అంతా కేసీయారే కాబట్టి బీఆర్ఎస్ నేతలకే గాలమేస్తున్నారు.





అయితే వాళ్ళు ఊహించినట్లుగా బీఆర్ఎస్ నేతలు ఎవరూ పెద్దగా రెస్పాండ్ కావటంలేదు. పోనీ కాంగ్రెస్ నేతలైనా వస్తారని అనుకుంటే వాళ్ళూ ఊగిసలాటలో ఉన్నారు. మహేశ్వరరెడ్డి తప్ప కాంగ్రెస్ లోనుండి ఇంకెవరు బీజేపీలో చేరలేదు. ఈమధ్యనే జరిగిన కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించటంతో హస్తంపార్టీ నేతలు ఎవరు బీజేపీలో చేరటానికి ఇష్టపడటంలేదు. సో, ఈటల తాజా వ్యాఖ్యలతో అర్ధమవుతున్నది ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో అన్నీ నియోజకవర్గాల్లో పోటీచేయటానికి పార్టీకి గట్టి నేతలు కూడా లేరని. అందుకనే వలసనేతలే తమకు దిక్కని ఈటల అంగీకరించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: