ఏపీ బీజేపీ అధ్యక్షుడు వైసీపీ టీడీపీ తీరును సోము వీర్రాజు తీవ్రంగా తప్పుబట్టారు. ఆత్మహత్య వ్యవహారంలో పోలీసులను అరెస్టు చేయడం న్యాయం కాదని... అసలు నిజానిజాలు త్వరలోనే బయట పడతాయని సోము వీర్రాజు తెలిపారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే సీఎంను అరెస్టు చేస్తారా అని ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించారు. అబ్దుల్ కలాం కుటుంబ ఆత్మ హత్య కేసును చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని... కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ టీడీపీలకు ముస్లిం ఓట్లే ముఖ్యమా అని ప్రశ్నిస్తూ .. ముస్లింలేనా మనుషులు మిగిలిన వాళ్లు కారా అని గట్టిగా నిలదీశారు.