వైసీపీ ఆవిర్భావం సమయంలో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా వైసీపీ ని స్థాపించిన విషయం తెలిసిందే. కానీ తెలంగాణలో వైసీపీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం దివంగత నేత ఉమ్మడి రాష్ట్రాల మాజీ సీఎం వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వై ఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలో తెలంగాణ పాత వైసీపీ నాయకులంతా కూడా షర్మిల పార్టీలోకి వెళుతున్నారు.