రాజకీయ దిగ్గజాలకు కొలువైన నెల్లూరులో సరికొత్త బ్రాండ్ కు అనిల్ కుమార్ యాదవ్ తెర తీసారు.ఎమ్మెల్యే గా ఒక్కసారి మాత్రమే ఎన్నికైనా తనదైన వాగ్దాటితో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా నెల్లూరు సిటీలో తిరుగులేని నాయకుడిగా అనతి కాలంలోనే ఏదిగారు.అనిల్ కుమార్ యాదవ్ చిన్నప్పటి నుంచి చదువులో మంచి నైపుణ్యం చూపించేవాడు.మెరుగైన ఫలితాలు సాధించేవాడు.పెద్దగా అతను చదువుకోపోయిన అతని మార్కులు చూసి స్నేహితులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు.BDS పూర్తి చేసిన ప్రాక్టిస్ మొదలు పెట్టలేదు.