టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడుతున్న సంగతీ తెలిసిందే. అయితే ఇంతకముందు జగన్ అవిశ్వాస తీర్మానం పెడతామంటే చంద్ర బాబు నాయుడు హేళన చేశాడు. అప్పుడు, ఇప్పుడు టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు. అయితే టీడీపీ నాయకులూ మాట్లాడుతున్న మాటలు వింటుంటే జనాలకు అనుమానాలు వస్తున్నాయి. ఒక పక్కేమో మోడీ ప్రభుత్వం ను పడగొట్టే ఉద్దేశం లేదంటారు. అలాంటపుడూ అవిశ్వాస తీర్మానం పెట్టడం ఎందుకు..!

Image result for tdp

తమ అవిశ్వాసం తీర్మానం మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టేది కాదని, పడగొట్టే ఉద్దేశం కూడా లేదని, అవిశ్వాస తీర్మానం ఓటింగ్ లో పాల్గొనాల్సిన అవసరం లేదని కూడా టీడీపీ ఎంపీలే చెబుతున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు మోడీని ఢీకొట్టాడు అని, అన్ని పార్టీలతోనూ చర్చలు జరుపుతున్నారని అనుకూల మీడియా వార్తలు ఇస్తోంది. అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీలతో మాట్లాడుతున్నారని చెబుతున్నారు. నిజానికి వాళ్లతో మాట్లాడాల్సిన అవసరంలేదు.

Image result for tdp

మోడీకి వ్యతిరేకంగా ఎవరు నిలిచినా వాళ్లే కలిసివస్తారు. చంద్రబాబు వాళ్లతో మాట్లాడుతున్నాడట, టీడీపీ ఎంపీలు వాళ్లతో సమావేశం అవుతున్నారట! ఇక్కడ తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధినే ప్రశ్నించాల్సి వస్తోంది. అవిశ్వాస తీర్మానం ఉత్తుత్తిదే, అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తేనేం, వేయకపోతేనేం.. అని టీడీపీ ఎంపీలే అంటున్నారు. మరోవైపు మమతతోనూ, కేజ్రీవాల్ తోనూ చర్చలట! ఆ చర్చలేవో తెలుగుదేశం వాళ్లు, తెలుగుదేశం వాళ్లతోనే చేసుకుంటే మంచిదేమో. వీళ్లకే తాము ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానంపై విశ్వాసంలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: