ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు నాయకుడు.. ఈ సూత్రం అక్షరాలా జగన్ కు వర్తిస్తుందని ఆయన తాజా నిర్ణయం రుజువు చేస్తుంది. ఇటీవల కేసీఆర్ తో గవర్నర్ సమక్షంలో చర్చించిన జగన్.. కొన్ని విషయాల్లో పట్టువిడుపు ధోరణి అవలంభించారు. 


అందులో హైదరాబాద్ లోని ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించడం ఒకటి. ఏపీ సెక్రటేరియట్ ను అమరావతిలో కట్టుకున్నాక.. హైదరాబాద్ సెక్రటేరియట్ లో ఏపీకి కేటాయించిన భవనాలన్నీ వృథాగా పడి ఉన్నాయి. రెండేళ్లుగా వాటిలో గబ్బిలాలు కాపురముంటున్నాయి. వాటిని తమకు
ఇవ్వమని గతంలో కేసీఆర్ సర్కారు ఏపీని అడిగినా అప్పటి సర్కారు పంతానికి వెళ్లి ఇవ్వలేదు. 

ఆ భవనాల వల్ల ఏపీకి రూపాయి కూడా ఆదాయం, అవసరం లేకపోగా.. వాటి మెయింటెన్స్ రుసుములు, కరంట్ బిల్లుల కింద కోట్ల రూపాయల వ్యయం అవుతోంది. అందుకే జగన్ పంతాలకు పోకుండా ప్రాక్టికల్ గా ఆలోచించాడు. ఇంకా ఐదేళ్లు ఆ భవనాలు ఏపీ ఆధీనంలో ఉంటే వీలున్నా వాటిని తెలంగాణకు ఇచ్చేందుకు అంగీకరించారు. 


ఈ నిర్ణయం వల్ల కేసీఆర్ సర్కారుతో మరో విషయంలో బార్గెయినింగ్ చేయగల సత్తా జగన్ కు సమకూరుతుంది. ఒక విషయంలో ఏపీ తగ్గితే.. మరో విషయంలో తెలంగాణ తగ్గుతుంది. ఇలా పట్టువిడుపుల వల్ల రెండు రాష్ట్రాలు లాభం పొందుతాయి. అందుకే జగన్ ఎక్కడ తగ్గాలో తెలిసి మసలు కున్నారనే చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: