అవును.. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తొలిసారి జగన్ కు లేఖ రాశారు. జగన్ ప్రభుత్వానికి 100 రోజుల డెడ్ లైన్ పెట్టారు.


ఆ లేఖలో ఏమని రాశారంటే... "ప్రభుత్వానికి 100 రోజులు టైమిద్దామనుకున్నా కానీ ప్రభుత్వ ఇసుక విధానం వల్ల రాయక తప్పడం లేదన్నారు .. భవన నిర్మాణ కార్మికుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని రాస్తున్నట్టు ప్రకటించారు .. కార్మికుల పక్షాన జన సేన ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు .. ఇసుక విధానంపై ప్రభుత్వం సెప్టెంబర్ 5 న నిర్ణయం ప్రకటిస్తే అప్పటివరకూ కార్మికుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ .


ఈ లేఖతో పాటే కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు కూడా చేశారు పవన్ కల్యాణ్.. ఎన్నికల్లో తక్కువ టైం తక్కువగా ఉండడం వల్లనే తాను ఓడిపోయానని అభిప్రాయపడ్డారు .. తెలుగుదేశం తో పొత్తు పెట్టుకోవాలంటే ఎవరు అడ్డు చెప్తారు.. ఒంటరిగా పోటీ చేయాలనుకున్నాం చేసాం .. అంతే అన్నారు ..


ఈ వ్యాఖ్యలే కాస్త అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది.. ఏపీలో ఎన్నికలేమీ ముందస్తుగా రాలేదు. సమయం ప్రకారమే 2014 తర్వాత 2019లోనే వచ్చాయి. మరి సమయం లేకపోవడమేంటో.. అయినా జనసేన పార్టీ పెట్టి ఐదేళ్లు దాటిపోయింది.. ఇంకా సమయం చాలకపోవడమేంటో అర్థంకాని విషయం.


అంటే తక్కువ సమయంలోనైనా సరే ఎన్నికల్లో గెలవచ్చు అనుకున్నారా.. ఏ పార్టీతో పొత్తు లేకపోయినా సత్తా చాటుదామనుకున్నారా.. అంటే తమ శక్తిని తాము అంచనా వేసుకోవడంలో పవన్ కల్యాణ్ ఘోరంగా విఫలమయ్యారా.. పవన్ కామెంట్లు చూస్తే అలాగే అనిపిస్తోంది.


ఏదేమైనా.. జనసేన పార్టీ ఆవిర్భావ లక్ష్యమే ప్రశ్నించడం ..అధికారపార్టీ లోపాలను ఎత్తిచూపి ప్రశ్నించడమే భాద్యతగా స్వీకరించిన జనసేనాని.. ప్రశ్నించడం మొదలుపెట్టడం తో జనసేన శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చినట్లయింది . చూడాలి ముందు ముందు పార్టీని పవన్ ఎలా నడిపిస్తాడో..


మరింత సమాచారం తెలుసుకోండి: