ఎర్రమంజిల్ ప్యాలెస్ కూల్చివేసే విషయంను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో ఇవాళ కూడా వాదనలు కొనసాగనున్నాయి. నిన్న జరిగిన విచారణలో నూతన అసెంబ్లీ నిర్మాణం కోసం ఎర్రమంజిల్ ప్యాలెస్ కూల్చివేయాలన్న మంత్రి మండలి నిర్ణయంలో తప్పేముందని పిటిషనర్ల తరపు లాయర్ లను హై కోర్టు డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. పురాతనమైన ఎర్రమంజిల్ భవనం శిథిలావస్థకు చేరుకుందని శాసన సభ మరియు శాసనమండలి నిర్మాణానికి ఇరవై ఐదు ఎకరాలు అవసరమవుతాయని ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీయర్ ఇచ్చిన వివరాలను విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది.



అసెంబ్లీ కౌన్సిల్ భవనాలు చెంత నర్సరీని కలుపుకుని పధ్ధెనిమిది ఎకరాల ఏమౌతుందని, మెరుగైన సౌకర్యాలతో మరో భవనం నిర్మించుకోవచ్చు కదా అని కోర్టు వ్యాఖ్యానించింది. హెరిటేజ్ భవనాలకు రక్షణ లేకుండా పోయిందని కమిటీ వేయాలని కోర్టు ఆదేశించినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఒక పిటిషనర్ తరపు న్యాయవాది నళిన్ కుమార్ వాదించారు. చారిత్రక భవనంగా గుర్తించిన ఎర్రమంజిల్ ప్యాలెస్ ను కూల్చివేయరాదని ఆయన కోరారు.


ఆ ప్రాంతంలో అసెంబ్లీ నిర్మిస్తే తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతాయని  కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకునే అధికారం కోర్టుకు ఉంటుందనీ మరో పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ తెలియజేశారు. చెస్ట్ ఆస్పత్రి భవనాన్ని, హెరిటేజ్ భవనాల జాబితాలో చేర్చాలనే హెరిటేజ్ కమిటీ సిఫార్సు చేసింది. కోర్టు జోక్యంతో ఆ భవనం కూల్చివేయకుండా ప్రభుత్వం వెను తిరిగిందని  తెలిపారు.దురుద్దేశంతోనే ఎర్రమంజిల్ ప్యాలెస్ ను కూల్చివేసి అసెంబ్లీ భవనాలు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని వాదించారు. పిటిషనర్ తరపు లాయర్ ప్రభాకర్ వాదనతో ధర్మాసనం వివరించింది. ఎర్రమంజిల్ ప్యాలెస్ కూల్చివేత నిర్ణయాల్లో దురుద్దేశాలు ఎక్కడ ఉన్నాయో చూపాలన్నది.



ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్ శాసన సభ కార్యదర్శిలకు అక్కడే నివాస గృహాల ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ వాదనను న్యాయవాది దాన్ని వ్యతిరేకించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు ఉంటే ఇప్పుడు ఆ భారం లక్షా ఎనభై తొమ్మిది వేల కోట్లకు చేరిందని ఇలాంటి పరిస్తితిల్లో కొత్తగా అసెంబ్లీ నిర్మాణం ఎందుకంటూ పిటిషనర్ల తరఫు లాయర్ లు వాదించారు. ఈ వాదనపై ఘాటుగా స్పందించింది ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం అప్పులుంటే అభివృద్ధి చెయ్యవద్దని ఆదేశించారా అని ప్రశ్నించింది.



జాతీయ స్థాయిలో ఎంత హక్కు ఉందో చెప్పాలని అడిగింది. చట్టాలకు అనుగుణంగా వాదన చేయాలని సూచించి తదుపరి విచారణను ఇవాల్టి కి వాయిదా వేశారు.ఇక ఇలాంటి పరిస్తితికి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: