ఏపీ సీఎం జగన్ మొన్న ఢిల్లీ వెళ్లి ప్రధానిని మోడీని కలిశారు. ఓ వైపు కాశ్మీర్ విభజన బిల్లు, ఆర్టికల్ 370 రద్దు వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్న రోజు కూడా ప్రధాని నరేంద్ర మోడీ తీరిక చేసుకుని జగన్ కు సమయం కేటాయించారు. దాదాపు 45 నిమిషాల పాటు మోడీతో జగన్ బేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, ఇతర ప్రాజెక్టుల గురించి జగన్ మోడీతో చర్చించారని వైసీపీ చెబుతోంది.


ఓ రాష్ట్ర సీఎం ప్రధాన మంత్రిని కలవడం సాధారణ విషయమే. కానీ ఎందుకో ఈ భేటీని చూసి టీడీపీ ఉలిక్కిపడుతోంది. జగన్ మోడీకి ఇచ్చిన వినతి పత్రాన్ని మీడియాకు విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. అది పబ్లిక్ డాక్యుమెంట్ అని అందులో ఏముందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని కొత్త వాదన తెరపైకి తెస్తోంది.


గతంలో చంద్రబాబు అనేక సార్లు ముఖ్యమంత్రి హోదాలో ప్రధాని మోడీని కలిశారు. అప్పుడు ప్రధానిని కలిసి ఏం వినతపత్రం ఇచ్చారో మీడియాకు విడుదల చేసిన దాఖలాలు లేవు.. మరి ఇప్పుడు ఇలా కొత్త డిమాండ్ ఎందుకు చేస్తున్నారు.. చంద్రబాబు చెప్పేదేమంటే.. ఢిల్లీ వెళ్లిన జగన్ ప్రధానికి అమరావతిలో ఏదో జరిగిందని చెప్పారనీ కానీ ఇక్కడ జరగని దానికి జరిగిందని చెప్పి నిరూపించలేరు అని అంటున్నారు. ఢిల్లీ వెళ్లి ప్రధానిని అభివృద్ధి గురించి నిధులు అడగాలి గాని,తమ హయాంలో ఏదో అవినీతి జరిగిందని దానిపై ఫిర్యాదులు చేయడానికి జగన్ వెళ్లారు అని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు.


అసలు జగన్ చంద్రబాబుపై ఫిర్యాదు చేశారని టీడీపీకి ఎవరు చెప్పారు.. ఒక వేళ చేసినా.. అవన్నీ ఓరల్ గా ఉంటాయి తప్ప.. పేపర్ పై ఉంటాయా.. ఉన్నా.. అవి మీడియాకు ఇస్తారా.. ఒకవేళ ఇచ్చినా.. అసలు చంద్రబాబు తప్పు చేయనప్పుడు జగన్ ఎవరిని కలిస్తే ఏమి.. ఏమని ఫిర్యాదు చేస్తే ఏమి.. చంద్రబాబులో ఈ ఉలికిపాటు ఎందుకు.. ఇప్పుడు ఇవీ సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు.


మరింత సమాచారం తెలుసుకోండి: