రాజధాని ప్రాంతంలో జనసేన అధినేత పవన్ పర్యటించారు. రాజధాని మార్పును ఒప్పుకోబోమంటున్నారు. రాజు మారినప్పుడల్లా రాజధాని మారదంటూ సెటైర్లు వేస్తున్నారు. అంతే కాదు.. గతంలో తాను రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవద్దని పోరాడాను తప్ప.. అమరావతిలో రాజధాని వద్దు అనలేదని వివరణ ఇస్తున్నారు.. జనసేన అదినేత పవన్ కళ్యాణ్.


అంతే కాదు.. ఒక్క సామాజిక వర్గానికి చెందిన రాజధాని అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ 14 సామాజిక వర్గాల వారు భూములు ఇచ్చారు. రాజధాని మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే గతంలో రైతులకు ఎలా అండగా నిలబడ్డానో అలానే రైతులకు అండగా నిలబడతాను. గతంలో భూ సేకరణను వ్యతిరేకించాం, ఇప్పుడు రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్నాం... అంటున్నారు పవన్.


రాజధాని వ్యవహారంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఎంతవరకైనా వెళ్తాం. అవసరం అయితే ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి శ్రీ అమిత్ షాలను కలుస్తాం. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం. రైతుల త్యాగాలు వృథా పోనీయం. వారికి జనసేన అండగా ఉంటుంది అని ఆయన భరోసా ఇచ్చారు.


అంత వరకూ బాగానే ఉంది.. కానీ రాజధాని ప్రాంతంలో 14 సామాజిక వర్గాల వారు భూములు ఇచ్చారని పవన్ కల్యాణ్ చెబుతున్నారు.. అదీ నిజమే.. కానీ రాజధాని ప్రాంతంలో 85 శాతం భూములు ఒకే సామాజిక వర్గానికి చెందివారివని... అదే సామాజిక వర్గానికి చెందిన ఓ పత్రికాధిపతి తన సంపాదకీయంలోనే సెలవిచ్చారు. పేరుకు 14 సామాజిక వర్గాల వారు ఇచ్చినా.. అందులో 85 శాతం భూమి ఒక్క కులం వారు ఇచ్చినట్టేగా.. మరి పవన్ ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు.. తెలియకనా.. తెలిసి కూడా రాజకీయం చేస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: