అదిరిపోయే మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ముందు ప్రతిపక్షాలు తేలిపోతున్నాయి. ఓ వైపు ప్రజలు మేలు చేసే పథకాలు, నిర్ణయాలు అమలు చేస్తూనే జగన్ ప్రభుత్వం….ప్రతిపక్షాలు చేసే విమర్శలకు గట్టి కౌంటర్లు ఇస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా ఏ పార్టీ అయినా నోరు ఎత్తిన....వారు నోరు మూయించేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లని అయితే వైసీపీ మంత్రులు ఒక ఆట ఆడేసుకుంటున్నారు.

 

అయితే బయటే పరిస్థితి ఇలా ఉంటే అసెంబ్లీలో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేల పరిస్తితి ఎటు కాకుండా అయిపోయింది. వారు ఏ మాత్రం నోరు మెదిపిన వెనుక ఉండి వైసీపీ నేతలు వెంటనే సెటైర్లు వేసేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్తితుల్లో పవన్ కల్యాణ్ అసెంబ్లీలో లేకుండా బ్రతికిపోయారని రాష్ట్రంలో చర్చ నడుస్తుంది. ఎన్నికల్లో ఆయన రెండు చోట్ల ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు అసెంబ్లీకి వెళ్ళే అవకాశం దక్కలేదు. 

 

ఒకవేళ గెలిచి ఉంటే అసెంబ్లీలో కూర్చునే వారు. ఇప్పటికే 23 మంది ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలే వైసీపీ ముందు నిలువలేకపోతున్నారు. ఇక ఒకటి అర్ర ఉండే జనసేన ఏం తట్టుకుంటుంది. అటు 40 సంవత్సరాల అనుభవం, 14 సంవత్సరాల సీఎంగా చేసిన చంద్రబాబుని చెడుగుడు ఆడేస్తున్నారు. అలాంటిది తొలిసారి శాసనసభకు వస్తే పవన్ పరిస్తితి ఎలా ఉండేదో. చంద్రబాబుకు ఎక్కువ సబ్జెక్ట్ తెలుసు కాబట్టి ఏదో విధంగా వైసీపీని ఎదురుకుంటూ వస్తున్నారు. కానీ సబ్జెక్ట్ తక్కువ ఆవేశం ఎక్కువ ఉన్న పవన్  అయితే వైసీపీ ముందు నిలబడలేరు. 

 

ఇప్పటికే ఆయన అసెంబ్లీలో లేకపోయిన సీఎంతో సహ ఎమ్మెల్యేలు పవన్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఆయన పెళ్లిళ్ల విషయంలో జగన్....సెటైర్లు మీద సెటైర్లు వేస్తున్నారు. ఇక డైరెక్ట్ గా పవన్ అసెంబ్లీలో ఉంటే పరిస్తితి ఎలా ఉండేదో ఊహాకే అందడం లేదు. ఏదేమైనా పవన్ అసెంబ్లీలో లేకపోవడమే బెటర్ అనే ఫీలింగ్ జనసైనికులకు ఉంద‌ట‌. ఈ విష‌యం వాళ్లే స‌ర‌దాగా సోష‌ల్ మీడియాలో చ‌ర్చించుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: