తాజాగా వైసిపి వర్గాల్లో వినిపిస్తున్న మాట ఇదే. అవినీతికి సంబంధించి చంద్రబాబునాయుడు మీద చర్యలు తీసుకోవటానికి సంబంధించి కేంద్రప్రభుత్వం దగ్గర చాలా ఆధారాలు కేంద్రప్రభుత్వం దగ్గర ఉన్నాయట. ఐటి, ఈడి,  సిబిఐ అధికారులు దేశంలోని వివిధ ప్రముఖ వ్యక్తులు, సంస్ధలపై జరిగిన దాడుల్లో  కొందరి దగ్గర చంద్రబాబు కనెక్షన్లకు సంబంధించిన ఆధారాలు దొరికాయట.

 

మరి యాక్షన్ తీసుకోటానికి అవసరమైన ఆధారాలు కేంద్రం దగ్గర ఉన్నా ఇంకా ఎందుకు మీన మేషాలు లెక్కిస్తోంది ?  ఎందుకంటే అందుకు కారణం జగన్మోహన్ రెడ్డే అని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. అవును వినటానికి కాస్త విచిత్రంగా ఉన్నా  ముమ్మాటికి నిజమట. ఏపికి సంబంధించి పార్టీ పరిస్ధితి ఏదో బ్రహ్మాండంగా ఉందనో లేకపోతే పుంజుకుంటోందనో బిజెపి అగ్ర నేతలకు నమ్మకం లేదు.

 

రాష్ట్రంలో  ప్రస్తుతం బిజెపికి సంబంధించి ఇటు వైసిపి అటు టిడిపి రెండూ ప్రత్యర్ధి పార్టీలే. రెండింటిలో ఏదో ఓ పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే బిజెపికి నాలుగు సీట్లు వచ్చే అవకాశం లేదన్నది వాస్తవం. ఎన్డీఏ లో నుండి వచ్చేసిన తర్వాత కావచ్చు లేదా మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాతా కావచ్చు చంద్రబాబుతో  పొత్తు పెట్టుకునే ఆలోచన బిజెపిలో కనబడటంలేదు.

 

అదే సమయంలో జగన్ దూకుడును కూడా కమలం పార్టీ తట్టుకోలేకపోతోంది. అదే సమయంలో కేంద్రం ఆధిపత్యాన్ని జగన్ లెక్క చేయటం లేదనే విషయం చాలా సార్లు రుజువైంది.  తన ఆధిపత్యాన్ని అంగీకరించని జగన్ తో పొత్తు పెట్టుకోవటం బిజెపికి కూడా ఇబ్బందే. తన ఆధిపత్యాన్ని జగన్ అంగీకరించాలని బిజెపి అగ్ర నాయకత్వం కోరుకుంటున్నట్లు సమాచారం. కేంద్రం ఆధిపత్యాన్ని గనుక జగన్ అంగీకరిస్తే వెంటనే చంద్రబాబు మీద యాక్షన్ కు బిజెపి రెడీగా ఉందని వైసిపి వర్గాల సమాచారం. అంటే కేంద్రానికి జగన్ సరెండర్ కానంత వరకు చంద్రబాబు సేఫే అన్నమాట.  

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: