ఫిబ్రవరి 8వ తారీకున జరుగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ నేతలు నువ్వానేనా అన్నట్టుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి ఢిల్లీలో అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలవడంతో అదే ఊపు అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగించాలని తీవ్రంగా తపన పడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ ఓ జాతీయ మీడియా ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...ఇంతకాలం ఢిల్లీలో మేము ఎటువంటి అభివృద్ధి చేయడం జరిగిందో దాన్ని చూపించి ఓట్లు అడుగుతున్నామని కచ్చితంగా ఢిల్లీ ప్రజలు మరొకసారి ఆమ్ఆద్మీ పార్టీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

 

అంతేకాకుండా షాహిన్‌ బాగ్‌ నిరసనలు ఎన్నికల్లో ప్రధాన అంశాలు కాబోవని పేర్కొన్నారు. ఇదే తరుణంలో బిజెపి  ఢిల్లీలోని షాహిన్‌బాగ్‌ ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారిపై ఆమ్ ఆద్మీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని బిజెపి పార్టీ ఆరోపిస్తున్న.. ఈ నేపథ్యంలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రెచ్చగొట్టే రాజకీయాలు బీజేపీ చేస్తుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ సమయంలో జాతీయ మీడియా విలేఖరి సీఏఏ, ఏన్‌ఆర్‌సీపై మీ వైఖరేంటని ప్రశ్నించగా.. ఎన్నికల్లో ప్రజలు విద్యుత్‌, నీరు, విద్య, పాఠశాలలు, ఆసుపత్రుల అభివృద్ధి తదితర అంశాలకు ప్రాధాన్యతనిస్తారని చెప్పారు.

 

సీఏఏ, ఎన్‌ఆర్‌సీ ఈ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపవని అన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు రాష్ట్రంలో నివసిస్తున్నారని, అందుకే ఢిల్లీ మినీ ఇండియాగా పేరు గాంచిందని తెలిపారు. అంతే కాకుండా ప్రజలను విడదీయాలని చూసే రాజకీయ నేతలను పార్టీలను ఢిల్లీ ప్రజలు ఆదరించారని కేజ్రీవాల్ తెలిపారు. ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వ హయాంలో పాఠశాలలు మరియు హాస్పిటల్స్ అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.

 

అంతేకాకుండా కాలుష్యాన్ని తగ్గించడానికి అనేక నివారణ చర్యలను చేపట్టినట్లు తెలిపిన కేజ్రీవాల్ అవకాశవాద రాజకీయాలకు ఆమ్ ఆద్మీ పార్టీలో చోటు లేదు అని ఢిల్లీని ప్రపంచంలో నెంబర్ వన్ నగరంగా చేయడమే తమ లక్ష్యమని కేజ్రీవాల్ తెలిపారు. మా పార్టీపై అనేక ఆరోపణలు చేస్తున్న బిజెపి పార్టీ నేతలు తమ పార్టీ సీఎం క్యాండిడేట్ ఎవరో చెప్పాలని డిబేట్ లలో అతిగా మాట్లాడుతున్న వారికి సవాలు విసిరారు కేజ్రీవాల్. బీజేపీ పార్టీ సీఎం కానీ ఎవరో చెబితే తాను కూడా డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: