ఏమైనా సరే.. ఏపీ సీఎం జగన్ ను అప్రదిష్టపాలు చేయాలి. అందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు ఉంటే అన్నీ చేసేద్దాం.. అలాగే పొరపాటున జగన్ ఏదైనా మంచి పని చేసినా అది జనంలోకి వెళ్లకూడదు. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుందాం.. ఇదీ ఏపీలోని కొన్ని ప్రధాన పత్రికలు వ్యవహరిస్తున్న తీరు. మంచి ఉంటే మైకులో చెప్పాలి.. చెడు ఉంటే చెవిలో చెప్పాలి అంటూ ఇటీవల మెగాస్టార్ ఓ ప్రోగ్రాములో కామెంట్ చేశారు.

 

 

ఈ పత్రికలు దానికి పూర్తి రివర్స్.. జగన్ చెడు చేస్తే..దాన్ని గోరంతలు కొండంతలు చేద్దాం.. జగన్ ఏదైనా మంచి పని చేస్తే దాన్ని జనంలోకి వెళ్లకుండా ప్రయత్నం చేద్దాం..ఇదీ ఈ చంద్రబాబు అనుకూల పత్రికలు అనుసరిస్తున్న వ్యూహం. అందుకు తాజా ఉదాహరణ దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు వ్యవహారం. మొన్న ఏపీ సీఎం జగన్ దిశ పోలీస్ స్టేషన్లు ప్రారంభించారు. సాధారణంగా ఇది మంచి వార్త. మహిళలకు సమాజంలో రక్షణ లేకుండా పోయిన ఈ రోజుల్లో వారి రక్షణ కోసం ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటును మెచ్చుకోవాల్సిందే.

 

అలాగే మహిళల రక్షణ కోసం ఓ యాప్ కూడా రూపొందించారు. అయితే ఈ దిశ పోలీస్ స్టేషన్ల గురించి తెలుగు దేశం అనుకూల పత్రికల్లో వార్తలే పెద్దగా కనిపించలేదు. అంతే కాదు.. జగన్ దిశ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన వార్త సాధారణంగా మరుసటి రోజు పత్రికల్లో బ్యానర్ వార్త లేదా ప్రాధాన్యం ఉన్న వార్త అవుతుంది. కానీ అలా వేస్తే జగన్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న ఆందోళన ఎల్లో మీడియాను ఇబ్బంది పెట్టింది. మరి ఏం చేయాలి.

 

అందుకే భలే ప్లాన్ ఆలోచించారు. జగన్ దిశ పోలీస్ స్టేషన్ల ప్రారంభం కాకుండా ఇతర ప్రాధాన్యం అంతగా లేని వార్తలను కూడా ప్రముఖంగా ప్రచురించారు. ఓ పత్రిక ఢిల్లీలో కేజ్రీవాల్ మళ్లీ గెలవబోతున్నాడంటూ ఎగ్జిట్ పోల్స్ సర్వేను ఏకంగా కేజ్రీవాల్ గెలిచినంత రేంజ్‌లో బ్యానర్ పెట్టేశాయి. జగన్ దిశ పోలీస్ స్టేషన్ల వార్తను మొదటి పేజీల్లోనే ఎక్కడో ఓ మూలన సర్దేశాయి. ఇందుకు పాపం ఎంతో కష్టపడ్డాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: