ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలంటే సమాజంలో ఎంతో గౌరవం ఉండేది. ప్రజల కోసం పోరాడే పార్టీలుగా వాటికి పేరుండేది. ప్రత్యేకించి నిరుపేద వర్గాల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఆ పార్టీలు చేసిన పోరాటాలు ఎంతో గొప్పవి. కానీ కొన్నేళ్లుగా ఈ పార్టీలు తమ గుర్తింపు కోల్పోతున్నాయి. తమ ప్రత్యేకతతో పాటు జనం విశ్వాసం కూడా కోల్పోతున్నాయి.

cpi narayana <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RAMAKRISHNA' target='_blank' title='ramakrishna -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ramakrishna </a>కోసం చిత్ర ఫలితం

ఒకప్పుడు ఈ రెండు పార్టీల నుంచి కనీసం పది మంది వరకూ ఎమ్మెల్యేలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండేవారు. ఇప్పుడు రెండు పార్టీల్లోనూ కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేని దుస్థితికి ఈ పార్టీలు చేరుకున్నాయి. దీనికితోడు ఏపీలో ఈ పార్టీలు టీడీపీకి తోక పార్టీల్లా మారాయి. కమ్యూనిస్టు పార్టీల్లోని నారాయణ, రామకృష్ణ లాంటి వ్యక్తులు వచ్చాకే ఆ పార్టీలపై గౌరవం పోయిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీపీఐ నేత రామకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు.

cpi narayana <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RAMAKRISHNA' target='_blank' title='ramakrishna -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ramakrishna </a>కోసం చిత్ర ఫలితం

చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టులు చదివే బదులు కమ్యూనిస్టు పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం లో చేరండని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైయ‌స్ఆర్‌సీపీ మైనార్టీల పక్షపార్టీ, సెక్యులర్‌ పార్టీ అని అందరికీ తెలుసు.. అంజాద్‌ బాషా మాటకు కట్టుబడి ఉంటామని సీఎం వైయ‌స్ జగన్‌ బహిరంగ సభ సాక్షిగా ప్రకటించారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. రామకృష్ణ లాంటి వారి మాటలు నమ్మొద్దని మైనార్టీలకు శ్రీకాంత్‌ రెడ్డి సూచించారు.

cpi narayana <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RAMAKRISHNA' target='_blank' title='ramakrishna -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ramakrishna </a>కోసం చిత్ర ఫలితం

నారాయణ, రామకృష్ణలకు టీడీపీ నుంచి డబ్బులు అందుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రతిరోజు రామకృష్ణ లోకేష్‌ బండి ఎక్కుతారని.. డబ్బులు తీసుకుంటారని టీడీపీయే ప్రచారం చేస్తోందన్నారు. ‘చంద్రబాబు ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీకి, బీజేపీకి అక్రమ సంబంధం అంటగట్టాలని చూశారు.. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత బీజేపీతో సంబంధాలు నడుపుతున్నది టీడీపీ కాదా..?’ అని శ్రీకాంత్‌ రెడ్డి ప్రశ్నించారు. మరిఈ ప్రశ్నలకు ఈ ఎర్రన్నలు ఏం సమాధానం చెబుతారో..?

మరింత సమాచారం తెలుసుకోండి: