సరిగ్గా 9 నెలలు క్రితం ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కంచుకోటలు ఛిద్రమైనాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో నలభై సంవత్సరాలుగా తిరుగులేని రాజకీయ కుటుంబంగా కొనసాగుతున్న కేఈ కుటుంబం, గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసింది. మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు, 'కేఈ శ్యాంబాబు' మొదటి ఎన్నకలలోనే ఓటమిని చవిచూశారు. అతని ప్రత్యర్థి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత "కంగాటి శ్రీదేవి" 40 వేలకు పైగా, భారీ మెజారిటీతో గెలిచి విజయ దుందుభి మోత.. యావత్ ఆంధ్ర రాష్ట్రమంతటా మారు మ్రోగింది. తెలుగుదేశం పార్టీకి ఎదురులేదన్న నియోజకవర్గంలో ఆమె కేఈ వారసుడిని ఓడించి నిజానికి చరిత్ర పుటల్లోకెక్కారు.

 

IHG

వైసీపీ తరపు నుండి, మొదటి అభ్యర్థిగా.. పత్తికొండ నుంచి, కంగాటి శ్రీదేవిని జగన్ ప్రకటించిన తీరుని గమనించినట్లయితే, జగన్ కు కంగాటి శ్రీదేవి పై ఎంత నమ్మకముందో మనకు స్పష్టమౌతుంది. కొన్ని అనూహ్య పరిణామాల మధ్య రాజకీయ బరిలోకి దిగిన ఆమె ప్రస్థానాన్ని పొగడకుండా ఉండలేం. కొన్ని రాజకీయ దుష్ట శక్తుల చేతిలో అమరులైన ఆమె భర్త నారాయణరెడ్డి లేని లోటుని భర్తీ చేస్తూ, పత్తికొండ పాలిట "బంగారు కొండ"గా ఎదిగిన ఆమె తీరు.. న భూతొ న భవిష్యతి...

 

IHG

తన నియోజక వర్గంలో ఎవరికి కష్టం కలిగినా వెంటనే స్పందించే.. దయాగుణం కలిగిన వ్యక్తిగా ఎన్నో పేరు ప్రఖ్యాతులు గడించారు. కేవలం పత్తికొండ నియోజక వర్గ ప్రజలే కాకుండా, రాష్ట్ర ప్రజలు ఎవరైనా సరే.. తన సహాయం కోరి వస్తే తప్పకుండా సహాయం చేస్తానని, అది తన ధర్మమని చాలా సందర్భాల్లో ఆవిడ చెప్పడం.. ఆమె నిజాయితీకి తార్కాణం.

 

IHG

అవకాశం చిక్కినప్పుడల్లా ప్రజలకు చేరువగా ఉంటూ, వారి వారి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా అధికారులను సమన్వయ పరచడంలో ఆమెకు ఆమెయే సాటి. అందరిని తమ సొంత మషుల్లానే చూస్తారని.. తన నియోజక ప్రజలే చెప్పడం ద్వారా ఆమె ఎంత బాగా ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తారో మనకు సుస్పష్టమౌతుంది.

 

IHG

ఆమధ్య ఆమె యువత కోసం జరిపిన క్రికెట్ టోర్నమెంట్ గాని, అలాగే ఆర్ధిక సహాయం కోరి వచ్చిన వారికి సీఎం సహాయనిధి నుండి మంజూరైన చెక్కులను.. స్వయానా ఆమెయే శరణార్ధులకు ఇవ్వడం ద్వారా ప్రజలగురించి ఎంత బాధ్యత వహిస్తారో తెలుస్తుంది ఇట్లాగే అర్ధమవుతుంది. మన చర్యలే మనలను ప్రతిబింబిస్తాయి. ఆ రకంగా.. ఆమె చేతల ద్వారానే ఆమె ప్రజల మనిషి అయ్యారు. 'ప్రజలవద్దకు పాలన' అనే వాక్యం ఈమెకు సరిగ్గా సరిపోతుంది.. అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.!

మరింత సమాచారం తెలుసుకోండి: