కరోనా  వైరస్ పేరెత్తితే చాలు ప్రజలందరూ ప్రాణభయంతో వణికిపోతున్నారు. చైనా దేశంలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను ప్రాణ భయంతో వణికిస్తున్న  విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు చైనాలో విజృంభించి ఇప్పుడిప్పుడే అక్కడ తగ్గుముఖం పట్టినప్పటికీ... ఇతర దేశాల్లో మాత్రం కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఇక ఈ క్రమంలోనే భారత దేశాన్ని కూడా ప్రవేశించి రోజురోజుకు శరవేగంగా  వ్యాప్తిచెందుతుంది ఈ మహమ్మారి వైరస్. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కఠిన నిబంధనలు కూడా అమలులోకి తెచ్చాయి. అయితే తాజాగా ఆగ్రాలో ఓ వ్యక్తి కరోనా  బారినపడ్డ తన కుమార్తెను ఇంట్లో దాచి పెట్టాడు. కొద్దిరోజుల కిందట విదేశాలకు వెళ్లి వచ్చిన తన కుమార్తె వివరాలను దాచిపెట్టి...  తమ కూతురు కు సంబంధించి అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అధికారులు అతనిపై కేసు నమోదు చేశారు. ఇక ఆ వ్యక్తి కూతురికి కరోనా  వైరస్ సోకినట్లు  నిర్ధారణ కావడంతో ప్రస్తుతం ఐసొలేషన్ వార్డులో  ఉంచి చికిత్స అందిస్తున్నారు.

 

 

 వివరాల్లోకి వెళితే... ఆగ్రాలోని కంటోన్మెంట్ రైల్వే కాలనీ లో నివాసముండే ఓ మహిళ తన భర్తతో కలిసి ఇటీవల హనీమూన్ కోసం ఢిల్లీకి వెళ్లింది. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్తకు కరోనా వైరస్ లక్షణాలు ఉండడంతో పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు అతడు ట్రావెల్ హిస్టరీ ని చెక్ చేసారు . కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఎవరెవరిని కలిశారు.. ఏ ప్రదేశాలకు వెళ్ళాడు అనేది వివరాలు తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక వైద్య అధికారులు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం కూడా అందించారు. అయితే ఆగ్రా  కంటోన్మెంట్ రైల్వే కాలనీ లో తల్లిదండ్రుల వద్ద ఉన్న ఆ వ్యక్తి భార్యను... కరోనా వైరస్ నిమిత్తం పరీక్షించేందుకు వెళ్లగా... ఆ యువతి తండ్రి తన కూతురు సంబంధించి  అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చాడు. తమ కుమార్తె ఇంట్లో లేదని బెంగళూరుకు వెళ్ళింది అంటూ అధికారులను తప్పుదోవ పట్టించాడు ఆవ్యక్తి. కానీ ఆ యువతి ఇంట్లోనే ఉందని అధికారులు గుర్తించారు. 

 

 

 అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో మంది అధికారులు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తుంటే... ఆ వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరించి అధికారులను తప్పుదోవ పట్టించినందుకుగాను ఆ యువతి తండ్రి పై  పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక కరోనా  సోకినా ఆ యువతికి ప్రత్యేక వార్డులో  చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే అటు దేశంలో కూడా రోజురోజుకీ కరోనా  వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ప్రాణాంతక మహమ్మారి మాత్రం వస్తూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: