నియోజకవర్గంలో హైటెక్‌ వ్యభిచార నిర్వాహకులు సంఘంలో మంచి వారిలా చెలామణి అవుతూ.. రహస్యంగా హైటెక్‌ వ్యభిచారాన్ని గుట్టుగా నిర్వహిస్తున్నారు. కాగా., ఇప్పుడు అందరికి స్మార్ట్‌ ఫోన్‌ వయసుతో తేడా లేకుండా వాడుతున్న నేపథ్యంలో ఎక్కువ యువత ఫేస్‌ బుక్, టిక్‌ టాక్, హలో, వాట్సాప్‌ వాడుతున్నారు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇందులోని మహిళలు, అమ్మాయిలతో కొందరు వ్యభిచార నిర్వాహకులు ఫ్రెండ్‌ షిప్‌ చేసుకుని చాటింగ్‌ లు ద్వారా వారిని పరిచయం చేసుకుని ఇంకా ఇంకా వీరితో పరిచయం పెరిగి కాల్స్, లైవ్‌ కాల్స్‌ కు చేరుతోంది వ్యవహారం. అలా నెమ్మదిగా వారి వ్యక్తిగత వివరాలే కాకుండా, ఆర్థిక పరిస్థితులను తెలుసుకుని వారికి ఉపాధి ఉద్యోగాల పేరిట తొలుత బుట్టలో వేసుకోని అలా నెమ్మదిగా వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. 


అలా వారికీ జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి ఉద్యోగాలు ఉన్నయంటూ వారిని సంప్రదించాలని వల వేస్తున్నారు. స్థానికంగా ఉన్న అమ్మాయిలు, మహిళలను ఇళ్లకు పిలిపించుకోవడం.. వారికి అండగా ఉంటామంటూ నమ్మకాన్ని కల్పిస్తున్నారు. వారిని మెల్లమెల్లగా వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. ఒక్కసారి ఇందులోకి దిగినవారు మళ్లీ బయటకు రావడం కష్టమే మరి. ఇలా వ్యభిచార కూపంలోకి దించిన యువతులను డేటింగ్‌ యాప్‌ లోకి అడ్మిట్‌ చేయిస్తారు. డేటింగ్‌ యాప్స్‌లో ముఖ్యమైన కొన్ని సోషల్ మీడియా యాప్స్ లో వెళితే వందలు కాదు వేలాదిమంది స్నేహితులుగా మారుతారు. ఇందులో నియర్‌ బై అనే ఆప్షన్‌ ను  క్లిక్ చేస్తే ఈ ప్రాంతంలోకి వారిని సెలెక్ట్‌ చేసుకోవడం వల్ల లైవ్‌ కాల్స్‌ నుంచి డైరెక్ట్‌ గా మీటింగులు జరుగుతుంటాయి. 

 
అలా లాడ్జిలు, పట్టణాల్లోని ప్రాంతాల్లోని ఉన్న ఇళ్లు హైటెక్‌ వ్యభిచారానికి అడ్డాలుగా ఉన్నట్టు తెలుస్తోంది. అలా వారి ఇండ్లకు చుట్టాలు బంధువులు వచ్చినట్టుగా వస్తుంటారని, లాడ్జిల్లో ప్రత్యేక గదులే ఉన్నాయని సమాచారం. విటుల వద్దకు అమ్మాయిలను చేర్చేందుకు పట్టణంలోని కొందరు కార్లను కూడా అద్దెకు తీసుకుంటారని ఈ వ్యవహారానికి చాలా మంది ముక్యులు ఉన్నట్లు తెలుస్తోంది. వ్యవహారంలో సూత్రధారులు చాలామందే ఉన్నట్టు తెలుస్తోంది. వ్యభిచార నిర్వాహకులు డబ్బుల ఆశకు ఎంతో మంది మహిళలు, యువతులు, విద్యార్థినుల జీవితాలు నాశనమవుతున్నాయని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: