తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటివరకూ 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో కొంతమంది కరోనా గురించి వదంతులు ప్రచారం చేస్తున్నారు. సీపీ అంజనీ కుమార్ ఈ విషయం గురించి మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఎవరైనా కరోనా గురించి అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 
 
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అసత్య ప్రచారానికి పాల్పడిన 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లను నమ్మి ఆందోళనకు గురి కావద్దని సూచించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారి గురించి సీఎం కేసీఆర్ ఇప్పటికే సీరియస్ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోకి కేంద్ర బలగాలు వచ్చాయని, రెడ్ జోన్లు ఏర్పాటు చేశారని రకరకాల వదంతులు వైరల్ అయ్యాయి. 
 
వైరల్ అవుతున్న వదంతులను ఆపేందుకు సైబరాబాద్ పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అంజనీకుమార్ మాట్లాడుతూ కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా యుద్ధం లాంటి పరిస్థితులు నెలకొన్నాయని... ఇలాంటి సమయంలో ఫేక్ వార్తలు వైరల్ అవడం వల్ల పబ్లిక్ భయాందోళనకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మీడియా ఛానెళ్లు, వెబ్ సైట్లు, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 
 
హైదరాబాద్ లో రెడ్ జోన్లు లేవని హైదరాబాద్ సేఫ్ జోన్ అని అన్నారు. అత్యసరవరమైతే తప్ప ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రావడం లేదని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సీఎం కేసీఆర్ ఏప్రిల్ 7 తరువాత కొత్త కేసులు నమోదు కాకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: