భారత దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటున్న మహమ్మారి వైరస్ ప్రభావం తెలుగు రాష్ట్రాలకు కూడా చేరుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20కిపైగా కరోనా వైరస్  కేసులు నమోదయ్యాయి. ఇక అటు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ఎన్నో కఠిన నిబంధనలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా  వైరస్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు జగన్మోహన్ రెడ్డి  సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. ఇక ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్  ఏప్రిల్ 15 వరకు కొనసాగనుంది. 

 

 

 అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు కరోనా వైరస్ ప్రభావం గురించి స్పందిస్తూ ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు... సామాజిక దూరం పాటించి కరోనా  వైరస్ దరిచేర కుండా ఉండాలి అంటూ సూచిస్తూ ఉన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా కరోనా  వైరస్ ఎఫెక్ట్ కారణంగా కార్మికులు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పై మాట్లాడిన పవన్ కళ్యాణ్ పలు వ్యాఖ్యలు చేశారు. భవన నిర్మాణ రంగ కార్మికులు, ఉద్వాన,  ఆక్వా రైతులు కరోనా  వైరస్ ఎఫెక్ట్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన పవన్ కళ్యాణ్... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కార్మికుల్లో గుర్తింపు పొందిన వారు 21 లక్షల మంది ఉంటే గుర్తింపు పొందని వారు 30 లక్షల మంది వరకు ఉన్నారు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. 

 

 

 కేంద్ర మంత్రిత్వ శాఖ నుండి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు,  కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలన అధికారులకు... వెంటనే నిధులు విడుదల చేసేలా కేంద్రానికి లేఖలు రాసినట్లు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న లాక్ డౌన్  కారణంగా రోజువారి కూలి మీద ఆధారపడి బతికే చాలా మంది కార్మికుల కుటుంబాలు  జీవనాధారం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం లాక్ డౌన్  ఎఫెక్ట్ ద్వారా ఉద్యాన పంటలు పండించిన రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని... ముఖ్యంగా అరటి రైతులు అయితే పంటలను కోల్పోయే ప్రమాదం కూడా ఉండడంతో భయాందోళన చెందుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. కాగా వీరందరికీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: