ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ప్రజలనుద్దేశించి మీడియాతో ప్రసంగించారు. ఒక్కసారిగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోవడం బాధాకరమని చెప్పారు. రాష్ట్రంలో అనేక మందికి ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి వల్ల వైరస్ సోకిందని చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని వెంటనే గుర్తిస్తున్నామని... ఢిల్లీకి వెళ్లి వచ్చిన ప్రతి ఒక్కరినీ, వారిని కలిసిన వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. 
 
ప్రతి ఒక్కరూ కరోనా జ్వరంలాంటిదని గుర్తుంచుకోవాలని... 14 రోజుల పాటు మందులు, వైద్యం తీసుకుంటే నయం అవుతుందని చెప్పారు. కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నయమవుతుందని సూచించారు. ఎవరికైనా కరోనా వస్తే వాళ్లను ద్వేషించాలనో... వారిపై స్టిక్ మార్క్ వేసి చూడాలనో అనుకోవద్దని తాను కోరుతున్నానని చెప్పారు. ఒకవేళ మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వస్తే కుటుంబ సభ్యునిగానో, స్నేహితునిగానో వారిని ఇంకా ఆప్యాయంగా చూసుకోవాలని సూచించారు. 
 
ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వారి గురించి వెంటనే 104కు సమాచారం అందించాలని... వైద్యం చేయిస్తే కరోనా నయమవుతుందని చెప్పారు. ఎవరికైనా కరోనా వస్తే ఇంకా ఎక్కువ మానవత్వం చూపించాల్సిన అవసరం ఉందని అన్నారు. వారిపై వివక్ష చూపడం లాంటివి చేయవద్దని... కరోనా సోకిన వ్యక్తులు మన నుండి ప్రేమ, ఆప్యాయత మాత్రమే ఆశిస్తారని తెలిపారు. ఇంట్లోనే ఉండి వైద్యం చేయించుకోవచ్చని... వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉంటే 
అవసరమైతే ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తామని చెప్పారు. 
 
కరోనా వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం పడిందని అన్నారు. కరోనా లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే తమ ఆరోగ్య పరిస్థితి చెప్పేందుకు ఎంతమాత్రం మొహమాటపడొద్దని సూచించారు. కరోనా సోకిన వారిని చిన్నఛూపు చూడొద్దని ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో రైతులు అందరూ పనులు చేసుకోవాలని... రైతులు, రైతు కూలీలు, అక్వా రంగంలోని రైతులు బతకాలని సూచించారు. ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటి గంట వరకు రైతులు పనులు చేసుకోవాలని ఆ సమయంలో సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని కోరారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: