కరోనాపై పోరాటంలో భారత్ ప్రపంచానికే ఆదర్శమైందని ప్రధాని మోడీ అన్నారు. వీడియో ద్వారా ప్రసంగించిన మోదీ... ఈ పోరాటంలో కలసి వస్తున్న అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత్ తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని ఇప్పుడు ప్రపంచమంతా పాటిస్తోందని మోడీ తెలిపారు.

 

 

జనతా కర్ఫ్యూ పాటించడంలోనూ... అదే రోజు సాయంత్రం చప్పట్ల ద్వారా సంఘీభావం తెలపడంలోనూ భారత్ ప్రజలు చూపించిన చొరవను ప్రధాని కొనియాడారు. మేము ఒక్కరమే ఇంట్లో ఉంటే ఏమి సాధిస్తామని ప్రజలు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటే కరోనాను జయించినట్లే. జనతా కర్ఫ్యూ ద్వారా భారతీయులు తమ శక్తి సామర్థ్యాలు చాటారు. భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.. అన్నారు మోడీ.

 

 

లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా పాటించాలని.. ఈ ఆదివారం దేశ ప్రజలంతా కరోనాను తిప్పికొట్టే సంకల్పం తీసుకోవాలని పిలుపు ఇచ్చారు. ఆదివారం రాత్రి 9గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు బంద్‌ చేసి కొవ్వొత్తులు, దివ్వెలను వెలిగించాలి. 130 కోట్ల మంది ఈ సమయాన్ని నాకు ఇవ్వాలని కోరుతున్నా అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చర్యలు ద్వారా దేశ ప్రజల శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తాయన్నారు మోదీ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: