క‌రోనా.. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఎక్క‌డిక‌క్క‌డ ఈ ర‌క్క‌సి మరణ మృదంగం మోగిస్తుండ‌డంతో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. కరోనా దెబ్బకు అమెరికా అల్లకల్లోంగా మరింది. ఈ క‌రోనా మ‌హ‌మ్మారిని అడ్డుకోవ‌డానికి దేశ‌దేశాలు నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎక్క‌డిక‌క్క‌డ లాక్‌డౌన్‌లు విధించాయి.

 

అయితే కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలను పలువురు లెక్కచేయడం లేదు. ప్రతి ఒక్కరి సాకారంతోనే ప్రమాదకరమైన కరోనా వైరస్‌ను జయించవచ్చని ప్రభుత్వాలు చెబుతున్న పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనతా కర్ఫ్యూను కనీవినీ ఎరుగనిరీతిలో విజయవంతం చేసిన ప్రజలు లాక్‌డౌన్‌ విషయంలో ఆ స్ఫూర్తిని చూపడంలేదు. మరో వారంపాటు ఇంటికే పరిమితమైతే మహమ్మారిని తరిమికొట్టొచ్చని ప్ర‌భుత్వాలు చెబుతున్నా పెడ‌చెవిన పెడుతున్నారు.

 

ఇలా లాక్‌డౌన్ నిబంధనలు పట్టించుకోని ఓ వ్యక్తిపై అతని కొడుకే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..  ఢిల్లీ వసంత్ కుంజ్‌లోని రజోకరి ఏరియాలో నివాసం ఉంటున్న అభిషేక్  ఓ ఆటోమొబైల్ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే ప్ర‌స్తుతం  లాక్‌డౌన్ కార‌ణంగా అతని కుటుంబం అంతా ఇంటికే పరిమితమ‌య్యారు. కాని, అత‌ని తండ్రి వీరేందర్ సింగ్ మాత్రం లాక్‌డౌన్‌ ఉల్లంఘించి బయట తిరుగుతున్నాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో తన తండ్రి లాక్‌డౌన్ రూల్స్‌ను ఉల్లంఘించాడని చెబుతూ అభిషేక్  బుధవారం స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో  ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అత‌డిపై కేసు న‌మోదు చేశారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: