దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ ఎక్కువగా నోటి నుంచి వచ్చే తుంపరల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అందువల్ల ఉమ్మి వేయడంపై పలు రాష్ట్రాల్లో నిషేధం విధించారు. తుంపరల ద్వారా, ఉమ్మి ద్వారా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా గుట్కాలు వాడేవారు ఎక్కువగా ఉమ్మి వేస్తుంటారు. 
 
దీంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గుట్కాలపై బ్యాన్ విధించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం కఠినంగా ఈ నిర్ణయం అమలు జరిగేలా చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది. అతి త్వరలో కేంద్రం దీని గురించి అధికారిక ప్రకటన చేయనుందని తెలుస్తోంది. కేంద్రం కరోనాను కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా కఠిన చర్యలు అమలు చేయడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలో వెలువడనుంది. 
 
మరోవైపు దేశంలో కరోనాకు వ్యాక్సిన్ తయారు చేయడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు ప్రకటన చేసింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ వ్యాక్సిన్ అభివృద్ధిని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని అన్నారు. నిబంధనల ప్రకారమే దేశంలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ప్రకటన చేశారు. 
 
కేంద్రం హాట్ స్పాట్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో ఈ నెల 20వ తేదీ నుంచి ఎటువంటి మినాహాయింపులు ఉండవని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఈరోజు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సందేశం ఇచ్చారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి జాతి, కులం, మతం భాష, సరిహద్దులు చూడవద్దని తెలిపారు. కరోనా నివారణ కోసం వేసే ప్రతి అడుగు దేశ ఐక్యతకు, సోదరత్వానికి నిదర్శనంగా నిలవాలని చెప్పారు. మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య 16,000 దాటగా మృతుల సంఖ్య 500కు చేరువలో ఉంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: