ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తున్న  విషయం తెలిసిందే. అయితే మరోవైపు రాజకీయ విమర్శలు కూడా హాట్ హాట్ గానే సాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. సవాళ్లు ప్రతిసవాళ్లు ఆగడం లేదు. ఈ క్రమంలోనే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ కీలకనేత పార్లమెంటరీ సభ్యుడు  విజయ్ సాయి రెడ్డి మధ్య తీవ్ర విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి.  ఈ క్రమంలోనే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పై వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు సంచలన ఆరోపణలు చేసి సవాల్ విసిరారు. అయితే విజయసాయి వ్యాఖ్యలపై స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ... నన్ను కొనే దమ్ము ఎవరికీ లేదు... నీకు దమ్ముంటే మగాడివైతే కాణిపాకంలోని  ప్రమాణం చేస్తావా అంటూ విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. 

 

 

 ఇక లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని... కాణిపాకం లోనే కాదు తిరుమలలో కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం అంటూ తెలిపాడు విజయసాయిరెడ్డి. ఇప్పటి వరకు అవినీతికి పాల్పడ్డ లేదు అని చెప్పుకుంటున్న కన్నా లక్ష్మీనారాయణ, సుజన చౌదరిలు కాణిపాకంలో  తిరుమలలో కానీ ప్రమాణం చేయగలరా అంటూ సవాల్ విసిరారు విజయసాయిరెడ్డి. బోగస్ కంపెనీలు సృష్టించి బ్యాంకుల కు సుజనా చౌదరి కోట్లు రుణాలు ఎగ్గొట్టారు  అంటూ దుయ్యబట్టారు. గతంలో తాను సుజనా చౌదరి కోసం పనిచేశానని గత ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం ఎంత ఇచ్చింది అందులోనుంచి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పురందేశ్వరి లు ఎంత తీసుకున్నారు అన్న విషయాలు పూర్తిగా నాకు తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. 

 

 

 మీడియా ముఖంగా మరోసారి చెబుతున్న కన్నా లక్ష్మీనారాయణ 20 కోట్లకు అమ్ముడు పోయారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. ప్రజలను అక్రమంగా దోచుకో వలసిన కర్మ తమకు లేదు అంటూ వ్యాఖ్యానించిన  విజయసాయిరెడ్డి... రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు అంటూ తెలిపారు. విశాఖపట్నం రాజధానిగా వచ్చితీరుతుందని అడ్డుకునే శక్తి  ఎవరికీ లేదు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో మరోసారి బిజెపి నేతలు వైసీపీ నేత విజయసాయిరెడ్డి మధ్య మరోసారి చిచ్చు రాజుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: