హాలీవుడ్ నటీమణి డ్రూ బారీమోర్.. మెక్ కార్మిక్ స్పైసెస్ తో కలిసి ఒక మిలియన్ డాలర్స్(రూ7.5Cr) ని నాన్ ప్రాఫిట్ చారిటీ సంస్థ అయిన నో కిడ్ హంగ్రీ(No Kid Hungry) కి విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం అమెరికాలో కరోనా మహమ్మారి ఎంత ఆందోళనకరంగా విస్తరిస్తోంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ దేశంలో ప్రతి రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఎంతో బాధాకరం. 


కోవిడ్ 19 కారణంగా ఉపాధి కోల్పోయి ఆహారం లేక బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు చాలా మంది ప్రముఖుల ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. తాజాగా డ్రూ బారీమోర్ ఏడున్నర కోట్ల రూపాయలు తిండి లేక బాధపడుతున్న వారికి అందుతాయి. నటీమణి డ్రూ బారీమోర్ మాట్లాడుతూ... ఆహారం లేక బాధపడుతున్న వారందరికీ మెక్ కార్మిక్ స్పైసెస్ వారు చేయూత అందించడం నాకు బాగా నచ్చింది. ఈ సహాయ కార్యక్రమంలో నేను భాగస్వామ్యురాలు అయినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ పని లో భాగమైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను" అని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో వీడియో లో తెలిపింది. 


ఇకపోతే ఈ నలభై ఐదేళ్ల కాలిఫోర్నియా నటీమణి డ్రూ బారీమోర్ 2000 సంవత్సరంలో విడుదలైన చార్లెస్ ఏంజెల్స్ సినిమాలో కథానాయకిగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2001వ సంవత్సరంలో సస్పెన్స్ మూవీ అయిన డాన్ని డోర్క్ మూవీలో చాలా అద్భుతంగా నటించి అందరి ప్రశంసలను అందుకుంది. ఏమే చిన్నప్పటినుండే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి శ్వేతజాతీయులు ను బాగా అలరించింది. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ప్రోగ్రాం కి ఆమె 2007లో అంబాసిడర్ గా ఎంపికయింది. ఈ ప్రోగ్రాం ద్వారా ఆమె పిల్లలకు ఆహారం అందేలా చేసి తన మంచి మనసు చాటుకున్నారు. ప్రస్తుతం నెటిజనులు ఆమెను బాగా కొనియాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: