వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సమయంలో హైకోర్టు మాత్రం షాకు మీద షాకులు ఇస్తోంది. శుక్రవారం ఏకంగా మూడు విషయాల్లో జగన్ కు దిమ్మతిరిగే షాకు ఇచ్చింది. ప్రత్యేకించి వైద్యుడు సుధాకర్ అరెస్టు వ్యవహారంలో పోలీసుల తీరుపై మండిపడుతూ విచారణ కోసం ఏకంగా సీబీఐకి అప్పగించింది. దీంతో జగన్ సర్కారు కాస్త డిఫెన్సులో పడినట్టయింది.

 

 

అయితే విచిత్రం ఏంటంటే.. హైకోర్టు కూడా డాక్టర్ సుధాకర్ వంటి చిన్న కేసును కూడా సీబీఐకి అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి. ఒక కేసును సీబీఐకి అప్పగించడం అంటే మామూలు విషయం కాదు. అది ఎంతో ప్రతిష్టాత్మకమయ్యో.. లేక.. ఎంతో క్లిష్టమైనదో అయ్యుండాలి. కానీ డాక్టర్ సుధాకర్ కేసు కు అంత నేపథ్యం లేదు. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు హైకోర్టు తీర్పుపై కూడా కామెంట్ చేస్తున్నారు.

 

 

రాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డాక్టర్ సుధార్ ను సమర్ధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదని మాజీ ఎమ్మెల్యే, వైసిపి నేత ఆమంచి కృష్ణమోహన్ కామెంట్ చేశారు. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐ విచారణకు ఆదేశించటంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన కామెంట్ చేశారు. న్యాయస్థానం సామాన్య విషయాలకు సైతం సీబీఐ విచారణకు ఆదేశిస్తూ పోతే ప్రతి పోలీస్టేషన్ ఉన్న చోట కేంద్రం సీబీఐ ఆఫీసును ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆమంచి కృష్ణమోహన్ అన్నారు.

 

 

వైసిపి విజయం సాదించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలను ఆయన నిర్వహించారు. ఆ సమయంలోనే ఈ కామెంట్లు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని కొందరు అంటున్నారు. కానీ హైకోర్టు తీర్పుపై తన అభిప్రాయం చెప్పే హక్కు తనకు ఉందంటున్నారు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్. కానీ హైకోర్టుపైనే కామెంట్ చేస్తున్నారంటే.. లోపం ఈ నేతల్లో ఉందా.. హైకోర్టు తీర్పుల్లో ఉందా అని ప్రశ్నిస్తున్నారు ఇంకొందరు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: