తెలంగాణలో ఎప్పటికైనా అధికారం చేపట్టాలనే ఆశ, పట్టుదలతో బిజెపి ఉంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనం కావడంతో ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని పరోక్షంగా బిజెపి దక్కించుకున్నట్లు అయింది. ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ తెలంగాణ బిజెపి నాయకులు హడావుడి చేస్తున్నారు. టిఆర్ఎస్ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బీజేపీ మాత్రమే అన్నట్లుగా అక్కడి నాయకులు వ్యవహరిస్తున్నారు. రాబోయే ఆపదను ముందే పసిగట్టి, దానికి అనుగుణంగా ఎత్తుకు పైఎత్తులు వేయడంలో సిద్ధహస్తుడుగా పేరుపొందిన సీఎం కేసీఆర్ ముందు బిజెపి ఎత్తుగడలు చిత్తు అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ కి కొత్త అధ్యక్షుడిగా యువ నాయకుడు, ఎంపీ బండి సంజయ్ ను బిజెపి అధిష్టానం రంగంలోకి దించింది.  గత కొద్ది రోజులుగా ఆయన టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ హడావుడి చేస్తున్నారు.

 

IHG


 అయినా పెద్దగా ఫలితం కనిపించడంలేదు అనుకున్నారో ఏమో తెలియదు కానీ, ఇప్పుడు జనసేన అధినేత పవన్ రంగంలోకి దించేందుకు బిజెపి పెద్దలు డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది. బీజేపీ, జనసేన మిత్రపక్షాలు గా ఉన్నాయి. తెలంగాణలో పవన్ ను ఉపయోగించుకుని బీజేపీ ముందుకు వెళితే, వచ్చే ఎన్నికల నాటికి అధికారం దక్కించుకోవచ్చు అనే ఆశ బిజెపి నాయకుల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జనసేన అధినేత పవన్ ను కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు . తెలంగాణలో జనసేన యాక్టివ్ గా లేకపోయినప్పటికీ పవన్ కు అభిమానులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. యూత్ ని ఆకర్షించడంలో పవన్ ఇప్పటికే విజయం సాధించారు. పవన్ ను యూత్ ఐకాన్ గా యువత అంతా చూస్తూ ఉండడం వంటివి బాగా కలిసొచ్చే అంశాలు గా బిజెపి అంచనా వేస్తోంది. 


అందుకే ముందు ముందు ప్రజా పోరాటాల విషయంలో గాని, రాజకీయంగా ముందుకు వెళ్లే విషయంలో గాని పవన్ ను ముందు పెట్టి రాజకీయం చేయాలని బిజెపి ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు పవన్ తోడైతే, తెలంగాణ రాజకీయాలను కీలక మలుపు తిప్పే అవకాశం ఉంటుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. కాకపోతే పవన్ దూకుడుగా ముందుకు వెళ్లాలంటే, ఆయనకు పోతిరెడ్డిపాడు అంశం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ విషయంపై ఏ విధంగా పవన్ స్పందిస్తారో చూడాలి. ఏ అభిప్రాయాన్ని చెప్పినా ఏదో ఒక రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే ఆందోళన లో పవన్ కనిపిస్తున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు, ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం పూర్తిగా పవన్ మీదే ఆశలు పెట్టుకున్నట్టుగా కనిపిస్తున్నారు. పవన్ వీరి ఆశను తీరుస్తాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: