కరోనా మహమ్మారి కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు తప్పని పరిస్థితులలో వాయిదా వేయాల్సి వచ్చింది. గతంలో క్యాబినెట్ లో ఆమోదించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి ఈ నెల ఆఖరి లో తీరిపోతుండడంతో... అలాగే అనేకమైన బిల్లులు పెండింగులో ఉండడంతో జూన్ నెలలోనే మూడవ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ విషయంపై కచ్చితమైన నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ ని విడుదల చేయనుంది ప్రభుత్వం. 


కోవిడ్ 19 వ్యాధి కారణంగా రాష్ట్రం యొక్క బడ్జెట్ ఆమోదం వాయిదా పడగా... ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాబినెట్ ఆర్డినెన్స్ ద్వారా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను మూడు నెలల పాటు ఆమోదింపజేసుకునేందుకు. అయితే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదించబడి ఇప్పటికే రెండు నెలలు గడుస్తుండగా... జూన్ చివరి లో దాని గడువు తీరిపోతుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ లేకపోతే క్యాబినెట్ ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ పొడగింపు చేపట్టాలి. ఈ కారణంగానే జూన్ నెల మూడవ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ యోచిస్తోంది. ఒకవేళ అన్నీ సాఫీగా జరిగితే జూన్ నెల మూడవ వారంలో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. 


ఏపీ సర్కార్ అనుకున్నట్టు ఈ నెల ఆఖరి లో అసెంబ్లీ సమావేశాలు కొనసాగితే... ఓటాన్ అకౌంట్ పొడగింపు లేకపోతే పూర్తి బడ్జెట్ సమగ్రంగా ప్రవేశపెట్టడం... అది ఆమోదించడం కూడా తప్పకుండా జరుగుతాయి. ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమముని మినహాయించి ఇంకా ఎన్నో బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే అసెంబ్లీ సమావేశాలు ఎంత త్వరగా నిర్వహిస్తే అంత మంచిదని ఏపీ సర్కార్ భావిస్తోంది. 


ఇకపోతే రాజధాని బిల్లులను ఆమోదించకుండా తిరస్కరించకుండా వైసీపీ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారిన శాసన మండలిని సమావేశం కాకుండా చూసుకునేందుకు అనేక ఆలోచనలు చేస్తోంది ఏపీ సర్కార్. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ప్రారంభమైనా... మండలి సమావేశాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారనే దానిపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేకపోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సారి అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ లోనే మండలి సమావేశాల తేదీలను ప్రకటిస్తారు. కానీ శాసనమండలి సమావేశాలు అసలు నిర్వహించకూడదని భావిస్తున్న జగన్ ప్రభుత్వం అప్పటి నుండో వస్తున్న ఆనవాయితీ బ్రేక్ చేసి కేవలం అసెంబ్లీ సమావేశాలకు మాత్రమే తేదీలను వెల్లడిస్తుందా లేదా అనేది చూడాలిక.

మరింత సమాచారం తెలుసుకోండి: