ఈరోజు రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ రాజకీయ పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బలం లేకపోయినా, ఓటమి చెందుతారని తెలిసినా వర్ల రామయ్య ను రాజ్యసభ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నిలబెట్టింది. ఏపీలో నాలుగు స్థానాలకు గాను ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ స్థానాల్లో మొత్తం ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నాలుగు స్థానాలు వైసీపీ ఖాతాలో పడడం లాంఛనమే  అయినా తెలుగుదేశం పార్టీ వర్ల రామయ్యను అభ్యర్థిగా నిలబెట్టింది. పార్టీ ఎమ్మెల్యేలంతా ఓటింగ్ లో పాల్గొనడం కోసం తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేసింది. దీంతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినా వైసీపీకి అనుబంధ సభ్యులుగా కొనసాగుతున్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఏం చేయబోతున్నారు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

IHG


 ఒక్కో రాజ్యసభ అభ్యర్థికి 34 ఓట్లు వస్తే విజయం సాధిస్తారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ బలం 23 అందులో ముగ్గురు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీకి అనుబంధంగా కొనసాగుతున్నారు. అయితే ఈ ముగ్గురుకి పార్టీ విప్ జారీ ఇస్తే వారిపై అనర్హత వేటు వేయడానికి అవకాశం దొరుకుతుందని, తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ వారు ఓటింగ్ లో పాల్గొనకపోయినా, వారు విప్ ధిక్కరించినట్లే .ఒకవేళ వ్యతిరేకంగా ఓటు వేసినా విప్ ధిక్కరించినట్లు గానే లెక్క. వాస్తవానికి టిడిపి అభ్యర్థికి ఈ ముగ్గురు ఓటు వేయడం వల్ల జరిగే నష్టం ఏమీ ఉండదు. అలాగే వైసిపి కి కూడా ఎటువంటి నష్టం ఉండదు. 

IHG


కాకపోతే తెలుగుదేశం పార్టీని ధిక్కరించి వెళ్ళిన తర్వాత వారు ఇప్పుడు ఎవరికి మద్దతు ఇస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎటువంటి వివాదం లోను, చిక్కుల్లోనూ పడకుండా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయడమే ఏకైక మార్గం భావిస్తున్నారు. తాము ఓటు వేసినా, వేయకపోయినా వైసిపి నలుగురు అభ్యర్థులు ఎంపిక లాంఛనమే అవుతుంది. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో ఆ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. టీడీపీ గుర్తు మీద గెలిచిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలిగిరి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: