ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలుకు సుహారిక గత ఏడాది మే 29న ఆకస్మిక మరణం సంచలనం రేపిన విషయం తెలిసిందే. కన్నా  కోడలు మరణం పై అప్పట్లో ఎన్నో అనుమానాలు కూడా రేకెత్తాయి. అప్పటి వరకు సరదాగా గడిపిన సుహారిక ఉన్నట్టుంది కుప్పకూలడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈ కేసు ఎన్నో అనుమానాలు రేకెత్తించినప్పటికీ సుహారిక కార్డియాక్ అరెస్ట్ కారణంగానే ప్రాణాలు వదిలింది అన్నది నిర్ధారణ అయింది. దీంతో ఈ కేసుకు కాస్త సద్దుమణిగింది. ఈ కేసు గురించి అందరూ మరిచిపోతున్న తరుణంలో... తాజాగా తన భార్య మరణంపై కన్న తనయుడు ఫనింద్ర అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనం గా మారిపోయింది. 

 

 అంతేకాదు తన భార్య కేసు విషయమై సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ను కలవడం చర్చనీయాంశమైంది. భార్య మరణం పై తనకు అనుమానాలు ఉన్నాయని... విచారణ సజావుగా సాగేలా చేయాలంటూ అయినా సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు. అంతేకాకుండా సిబిఐటి  సమీపంలో ఉన్న ఫామ్ హౌస్ లో  నిహారిక చనిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు ఫణీంద్ర. కానీ ఏఐజి హాస్పిటల్ కు చేరువలో ఉన్న మీనాక్షి బాంబూస్  ఈ ప్రమాదం జరిగిందని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అంటూ అనుమానం వ్యక్తం చేశారు, 

 


 ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ముమ్మర దర్యాప్తు చేపట్టాలని సిపి సజ్జనార్ ను కోరారు, తన భార్య సుహారిక చనిపోయిన సమయంలో సంఘటనా స్థలంలో ఉన్న ప్రవీణ్,  వివేక్, విహస్, పవన్ అసలు నిజాలు  దాచి పెడుతున్నారని అనుమానం కలుగుతుందని... వారిని విచారించి అసలు నిజాలు తేల్చాలి అంటూ సి పి సజ్జనార్ ని కోరారు , అయితే కన్నా ఫణీంద్ర ఇలా ఎన్ని నెలల తర్వాత ఈ కేసును మరోసారి తెరమీదకు తెచ్చి అనుమానాలు వ్యక్తం చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక సీపీ సజ్జనార్ను స్వయంగా కలిసి.. కేసును దర్యాప్తు చేయాలని కోరడం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: