ప్రముఖ నిర్మాత, నటుడు నూతన నాయుడు ఇంట్లో ఈ ఘటన వెలుగు చూసింది. అతని ఇంట్లో పని చేస్తున్న యువకుడు పని మానేయడం సహించలేని అతని కుటుంబం అతనికి గుండు గీయించారు.. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పి నిందితుల పై ఆ యువకుడు కేసు పెట్టాడు.. రెండో సారి దలితుడి పై జరగడం తో దళిత సంఘాలు మమేకమై నిరసన చేపట్టారు. ఈ ఘటనకు ముఖ్య కారకురాలైన నూతన నాయుడు భార్యను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.
ఇది ఇలా ఉండగా అతను తన భార్యను కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ కేసు నుంచి ఆమెను తప్పించడానికి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరిట నూతన్ నాయుడు పలువురు అధికారులకు ఫోన్ చేసి మోసగించినట్లు సీపీ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. ఇకపోతే ఆమెను అరెస్ట్ చేసిన అనంతరం పరీక్షలు నిర్వహించేందుకు ఆసుపత్రికి తరలించగా, అక్కడ టెస్టులు చేస్తున్న డాక్టర్ కు కూడా ఫేక్ కాల్స్ రావడం సంచలనంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ కేసులు నిందితులుగా ఉన్న ఆరుగురిని అరెస్ట్ చేయడం తో పాటుగా, వారి నుంచి 6 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సిన్హా వెల్లడించారు. త్వరలోనే ఈ కేసును ఓ కొలిక్కి తీసుకొస్తామని ఆయన అన్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి