తాను అనుకున్నదే జరిగేలా చూడడం తమకు నచ్చడం లేదని వారు చెప్పే మాట.. ఎంత పార్టీ అధినాయకుడు అయితే మాత్రం మెజారిటీ ఉన్న నిర్ణయాన్ని చంద్రబాబు అమలు చేయాలి.. కానీ చంద్రబాబు తాను ఏదనుకుంటే అదే చేసి పార్టీ ని ఇలా దిగజార్చారని అంటున్నారు.. అమరావతి ఉద్యమం సమయంలో మొత్తానికి మొత్తం రాజీనామా చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు దాని ఊసే తియట్లేదు.. ఆ సవాల్ కు ఆ పార్టీ ఎమ్మెల్యేల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఒకవేళ రాజీనామా చేయాల్సి వస్తే మళ్లీ గెలిచే పరిస్థితి లేదని వారు భావించడం ఓ కారణమైతే.. అమరావతి ఎజెండా అనేది చంద్రబాబు పార్టీ కోసం కాకుండా కొందరి వ్యక్తుల కోసం అమలుచేస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు గుర్తించడం మరో కారణంగా తెలుస్తోంది.
ఇక ఇటీవలే వైసీపీ లోకి వచ్చిన విశాఖ ఎమెల్యే వాసుపల్లి గణేష్ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.. పార్టీ లోని లోపాల్ని, చంద్రబాబు విధానాల్ని తప్పుపట్టే విధంగా అయన మాట్లాడడంతో టీడీపీ లో ఇన్ని లోపాలు ఉన్నాయా అని అనిపిస్తుంది. అమరావతి కి మద్దతుగా విశాఖ లో ఉద్యమం చేయమని చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు.. స్థానిక ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా లేని ఉద్యమాలు చేయమంటే ఎలా చేయగలమని చెప్పారు. ఈ విషయాన్ని చంద్రబాబుకు పలు మార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి టీడీపీ నాశనానికి చంద్రబాబు అసలు కారణం అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదని తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి