పాడటం అరవటం ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది అని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కరోనా వైరస్ సోకిన వ్యక్తి నుంచి దగ్గు తుమ్ము, ముక్కు చీదడం. పాటలు పాడటం. అరవడం మాట్లాడటం గాలి పీల్చుకోవడం లాంటివి చేయడం ద్వారా కూడా.. వివిధ సైజులలో తుంపర్లు బయటకు వస్తాయని... అవి ఇతరులపై ప్రభావం చూపుతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వర్జీనియా టెక్ వర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అయితే చిన్న సైజు తుంపర్లు... సిగరెట్ పొగ మాదిరిగా వ్యాపించే తుంపర్లు కొన్ని గంటల వరకు గాలిలో ఉండే ప్రమాదం ఉంది అంటూ చెబుతున్నారు పరిశోధకులు.
పెద్ద తుంపర్ల కంటే ఈ చిన్న సైజు తుంపర్లు చాలా ప్రమాదకరం అంటూ హెచ్చరిస్తున్నారు. పెద్ద తుంపర్లు వెంటనే కింద పడిపోతాయని... చిన్న సైజు తుంపర్లు మాత్రం గంటల తరబడి గాలిలోనే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాదు ఆరు అడుగుల దూరం వరకు వ్యాపించే అవకాశాలు కూడా ఉన్నాయట. ప్రతి ఒక్కరూ ఆరు అడుగుల కంటే ఎక్కువగా భౌతిక దూరం పాటించాలి సూచిస్తున్నారు. ఇలా పాడటం అరవడం ద్వారా కూడా కరోనా వైరస్ సోకుతుంది అని ఆసక్తికర విషయాలు చెప్పి ప్రజలను అప్రమత్తం చేశారు పరిశోధకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి