ఇటీవల కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం మొత్తం అతలాకుతలం అయిపోయిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేనివిధంగా అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో హైదరాబాద్ నగర పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. చిన్నపాటి వర్షం పడితే నగరం చిగురుటాకులా వణికిపోతోంది... చివరికి భారీ వర్షం నమోదు కావడంతో పూర్తిగా జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయింది. లోతట్టు ప్రాంతాలు సాధారణ ప్రాంతాలు అనే తేడా లేకుండా పూర్తిగా వర్షపు నీరు నిండి పోయింది. దీంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు నగర వాసులు. మొన్న కురిసిన భారీ వర్షానికి ఇంకా వరదల్లో చిక్కుకొని ఉన్నాయి కొన్ని ప్రాంతాలు.




 అధికారులు సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఇక ఈ భారీ వర్షాల కారణంగా వరద నీరు మురికి నీరు జనావాసాల్లోకి  చేరడంతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రజల ఇక్కట్లు అన్ని ఇన్ని కావు అనే విషయం తెలిసిందే. డ్రైనేజీలు పొంగి  మురికి నీరు ఇళ్లలోకి చేరడంతో దుర్వాసన మధ్య ఎటు పోవాలో తెలీక దుర్భర జీవితాన్ని గడపాల్సి వస్తుంది. అయితే రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర వాసులు అందరూ మరింత బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే కురిసిన వర్షాలతో అల్లాడి పోతుంటే మళ్ళీ వర్షాలు అంటే తమ ప్రాణాలు పోతాయేమో అనే భయాందోళనలో ఉన్నారు నగరవాసులు.




 అదే క్రమంలో హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై అటు జిహెచ్ఎంసి అధికారులు పోలీసులు కూడా పలు కీలక సూచనలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నగర వాసులు అందరూ అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని.. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో నగర వాసులు అందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ అధికారులు సూచిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు మహిళను ఎట్టి పరిస్థితుల్లో తాగొద్దని... ప్రాణాలకే ప్రమాదం అంటూ హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పురాతన భవనాలలో ఉంటున్న వారు వాటిని వీడి వేరే భవనాల్లో కి వెళ్ళాలి అంటూ  అధికారులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: