పూర్తి వివరాలు తెలుసుకుంటే.. ఈ సంఘటన దుర్గ్ జిల్లాలోని జెవ్రా సిర్సా ప్రాంతంలో జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ పసి బాలిక మృతదేహం సోమవారం ఉదయం శివనాథ్ నదిలో తేలుతూ కనిపించింది. ఐతే గునియారి పోస్టుకు చెందిన భద్సర్ పంచాయతీకి చెందిన దండేశ్రాలో కొందరు స్నానం చేయడానికి శివనాథ్ నది ఒడ్డుకి వెళ్లారు. ఐతే ఆ సమయంలోనే వారికి ఒక బాలిక మృతదేహం నీళ్ళలో తేలుతూ కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన సదరు భక్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అలాగే ఈ విషయం తెలిసిన చాలామంది స్థానిక ప్రజలు కోట పుట్టిన సంఘటన స్థలానికి చేరుకొని ఒడ్డున తేలియాడుతున్న పసిబిడ్డను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఎందుకంటే ఆ పసి బిడ్డ పుట్టి కనీసం ఒక్క రోజు కూడా గడవనట్టు తెలుస్తోంది. ఆదివారం రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నదిలో పడవేసే ముందు బాలిక యొక్క బొడ్డు తాడు కత్తిరించకుండా విసిరేసినట్టు తెలుస్తోంది. ఈ బాలిక ఎవరికి చెందిందన్న ఆధారాలు కూడా దొరకలేదు. నదిలో పడవేసినప్పుడు బాలిక బతికే ఉందా లేదా అన్న విషయం తెలుసుకోవడానికి పోలీసులు ప్రస్తుతం పోస్ట్ మార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నారు. అయితే ఇదే నెలలో గత 10 నెలల్లో ఏడుగురు ఆడ పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీన్ని బట్టి చూస్తుంటే మొగ పిల్లలు పుట్టలేదన్న కారణంతో ఆడవారిని వదిలించుకోవాలని నదిలో పారేసి ప్రజలు వెళ్లిపోతున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఇక నుండైనా ఈ ప్రదేశంలో సీసీ కెమెరాలు అమర్చాలని పోలీసులు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి